»   » పవర్ పార్టీ, హీరోయిన్ ఎఫైర్: మధ్యలో నలిగిపోతున్న త్రివిక్రమ్!

పవర్ పార్టీ, హీరోయిన్ ఎఫైర్: మధ్యలో నలిగిపోతున్న త్రివిక్రమ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో అనతి కాలంలో తన టాలెంటుతో టాప్ రేంజికి ఎదిగిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన పరిశ్రమలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు అత్యంత సన్నిహితుడు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు రెండు.....రెండు విషయాల మధ్య నలిగిపోతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పార్టీ తెర వెనక ఉన్న ముఖ్యమైన వ్యక్తుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.

Trivikram

మరో విషయం ఏమిటంటే....ఇదే సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మరో వార్త చక్కర్లు కొడుతోంది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ప్రణీతతో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫైర్ కొనసాగిస్తున్నాడని ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందని అంటున్నారు.

గతంలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'జల్సా ' సినిమా సమయంలోనూ త్రివిక్రమ్-పార్వతి మెల్టన్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి తాజాగా ప్రణీత విషయంలో వినిపిస్తున్న వార్తల విషయంలో నిజం ఎంతో కాలమే నిర్ణయించాలి.

English summary
Some shocking rumours floated on the AD director Trivikram and this time it was about linkup between director and pretty actress Praneetha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu