For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానాపై మండిపడుతున్న త్రివిక్రమ్?

  By Srikanya
  |

  హైదరాబాద్: జల్సా, జులాయి అంటూ ఇలియానాని ఎంకరేజ్ చేసిన త్రివిక్రమ్ ఇప్పుడు ఆమె పేరు చెపితే మండిపడుతున్నాడని వినపడుతోంది. దానికి కారణం ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటమే అంటున్నారు. జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. నిజానికి త్రివిక్రమ్ ఈమెని తను పవన్ తో చేయబోతే తదుపరి చిత్రంలోనూ తీసుకుండాని వినిపించింది. ఇప్పుడు అది విరమించుకున్నాడని చెప్తున్నారు.

  ఇక దక్షిణాదిలో ఇలియానా కెరీర్‌ విషయానికి వస్తే ఆమెకు ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ ఇవ్వటానికి దర్శక,నిర్మాతలు ఆసక్తి చూపటం లేదు. జులాయి సినిమాకు ఆమె ప్లస్ కాకపోవటం, దేముడు చేసిన మనుష్యులు సైతం డిజాస్టర్ కావటం ఆమెకు మైనస్ అయ్యాయి. వాస్తవానికి రవితేజతో ఆమె చేసిన 'కిక్‌' తర్వాత వరుసగా ఐదు ఫ్లాప్‌లు రావడంతో ప్రస్తుతానికి ఇక్కడ డల్‌గానే ఉంది. ఈ మధ్యనే తమిళ దర్శకుడు శంకర్‌ తీసిన 'స్నేహితుడు' (అమీర్‌ ఖాన్‌ '3 ఈడియెట్స్‌' రీమేక్‌)లో కనిపించిన ఈమెకు కలిసిరాలేదు. ఆ సినిమా ప్లాప్ కావటం ఆమెకు తెలుగులో ఇబ్బందికర పరిస్దితి తెచ్చిపెట్టింది. దాంతో ఆమె తన దృష్టి మొత్తాన్ని బాలీవుడ్ పైనే పెట్టింది. బర్ఫీ చిత్రం ఆమెకు బాలీవుడ్ లో కెరీర్ తెచ్చిపెడుతుందని భావిస్తోంది.

  ప్రస్తుతం ఈ గోవా భామ తమిళ, హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్‌ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది'' అని చెప్పింది.

  అక్షయ్‌ కుమార్‌ హీరోగా నిర్మించబోయే 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై 2', 'ఖిలాడీ 786' చిత్రాల్లో ఇలియానాకు అవకాశం సంపాదించింది. 2010లో ఏక్తా కపూర్‌ నిర్మించిన 'వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై'కి ఈ చిత్రం సీక్వెల్‌ . మాఫియా డాన్‌లు దావూద్‌ ఇబ్రహీం (అక్షయ్‌), చోటా రాజన్‌ (షాహిద్‌)ల మధ్య గల శతృత్వమే దీని ఇతివృత్తం. ఇక రెండో సినిమా 'ఖిలాడీ 786'ని హాస్య ప్రధాన చిత్రంగా అక్షయ్‌, హిమేష్‌ రేష్మియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలో అనురాగ్‌ బసు రూపొందించిన 'బర్ఫీ'లో రణ్‌బీర్‌ కపూర్‌ భార్యగా ఇలియానా చేయటం ఆమెకు కలిసివచ్చింది. అయితే రిలీజైన తర్వాత గానీ ఆమె కేరీర్ ఏ రేంజికి వెళ్తుందో చెప్పలేమంటున్నారు బాలీవుడ్ పండితులు.

  English summary
  Many producers and directors who are close to the actress Ileana are unhappy with her. She did not attend any promotional event related to Julai film. Ileana even absconded from the audio function of Julayi. Now for all these deeds of behaving irresponsibly, Ileana will be soon facing the music. Latest we hear is that a group of directors and producers do not want to cast her in their films. Director Trivikram who is red in anger is also not interested in working with her anymore.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X