»   » త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు, ఎప్పటికీ ఆ నిర్మాతతో చేయడేమో?

త్రివిక్రమ్ హర్ట్ అయ్యాడు, ఎప్పటికీ ఆ నిర్మాతతో చేయడేమో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అ..ఆ' సినిమా విజయవంతం కావడంతో ఆ చిత్ర నిర్మాత రాధాకృష్ణ(చినబాబు) చాలా హ్యాపీగా ఉన్నారు. త్రివిక్రమ్ తో ఆయనకు ఇది మూడో సినిమా. ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ త్రివిక్రమ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి గల కారణాలు వెల్లడించారు. మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉందని, అందుకే వరుస సినిమాలు చేస్తున్నామన్నారు. ఇకపై త్రివిక్రమ్ సినిమాలకు కూడా తానే నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: 'అ..ఆ' బడ్జెట్, త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే...

రేర్ ఫోటోస్: దర్శకుడు త్రివిక్రమ్ ఫ్యామిలీతో...

రాధాకృష్ణ చెప్పిన వివరాలను బట్టి చూస్తే గత నిర్మాతల తీరు వల్ల త్రివిక్రమ్ బాగా హర్టయినట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు ఎంత క్లీన్ గా ఉంటాయో ఆయన మనసు కూడా అంతే క్లీన్ అనేది ఆయనతో పని చేసిన వారిమాట. ఇండస్ట్రీలోని మంచి డైరెక్టర్లలో(సినిమాల పరంగా, వ్యక్తిత్వం పరంగా) త్రివిక్రమ్ ఒకరు అని అంటుంటారు. అయితే అలాంటి వ్యక్తి మంచి తనాన్ని ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెడితే వాళ్ల మనసు విరిగి పోతోంది. మళ్లీ వాళ్లతో చేయడానికి ఇష్టపడరు.

Trivikram Hurt with Producer BVSN Prasad?

దర్శకుడు త్రివిక్రమ్ చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. అందుకే ఆయన తనకు కంఫర్టుగా ఉండే నిర్మాలతోనే చేయడానికి ఇష్టపడతారు తప్ప రిమార్కు ఉండే వారితో చేయడానికి ఇష్టపడరు. 'అత్తారింటి దారేది' సినిమాను నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాద్ తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ ను కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టారు.

అత్తారింటికి దారేది సినిమాకు భారీ లాభాలు వచ్చినా.... నిర్మాత ఈ ఇద్దరికి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదు. పవన్, త్రివిక్రమ్ ఆయనపై సినీమా సంఘాల్లో ఫిర్యాదు వరకు వెళ్లారంటే ఆయన ప్రవర్తన వీరిద్దరి పట్ల ఎంత బ్యాడ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ త్రివిక్రమ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తో సినిమాలు చేసే అవకాశం లేదని ఫిల్మ్ నగర్ టాక్.

English summary
Trivikram had bad experiences in the past with a few producers and this didn't go well with him. Trivikram to decide to work with producers only whom he is comfortable with. One name that's been doing the rounds in film nagar is producer BVSN Prasad who delivered blockbuster Attarintiki Daredi with Trivikram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu