»   » సమంత సీన్ లోకి వచ్చేకే నితిన్ గ్రీన్ సిగ్నల్

సమంత సీన్ లోకి వచ్చేకే నితిన్ గ్రీన్ సిగ్నల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంతో కొద్దిగా డీలా పడ్డ త్రివిక్రమ్ నితిన్ తో మరో సారి తన ప్రతిభను చూపటానికి రంగం సిద్దం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో నలుగుతోంది. ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేముందు ...సమంత కోసం నితిన్ వెయిట్ చేసాడని అంటున్నారు.

త్రివిక్రమ్ వెంటనే సమంతను తీసుకురాగానే నితిన్ సైన్ చేసాడని చెప్పుకుంటున్నారు. సమంత ప్రక్కన చేయాలని నితిన్ కు ఎప్పటినుంచో ఉందని అది ఈ చిత్రం తో తీరనుందని అంటున్నారు. అంటే త్రివిక్రమ్ కన్నా సమంతకే నితిన్ ప్రయారిటీ ఇచ్చారని అనుకుంటున్నారు. ఇక త్రివిక్రమ్ ఇంతకు ముందు అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల్లో సమంత ని తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో వెంటనే సమంత ఓకే చేసి,డేట్స్ ఎలాట్ చేసిందని చెప్తున్నారు.

ఇక నితిన్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. సెప్టెంబర్ లో చిత్రం ప్రారంభమయ్యి...సమ్మర్ కు రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఎస్ రాధాకృష్ణ ..తన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

గతంలో...

Trivikram project : Nithin Came Only After Samantha

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Samantha is the first who came on board for this yet-to-be-titled Trivikram film and she is followed by the lead actor Nithin.
Please Wait while comments are loading...