twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె విషయంలో సునీల్ పై త్రివిక్రమ్ ప్రెజర్

    By Srikanya
    |

    సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. అదే ఇఫ్పుడు సునీల్ కి తలనొప్పిగా మారిందని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. సునీల్ ని త్రివిక్రమ్ కలిసి తన గర్లప్రెండ్ పార్వతీ మిల్టన్ ని రికమెండ్ చేయమని కోరాడట. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కీ, పార్వతీ మిల్టన్ కి మధ్య స్నేహం జల్సా టైమ్ లో కలిసింది. అప్పట్లో వీరి బంధంపై అనేక రూమర్స్ సైతం వచ్చాయి. దాంతో ఆమెను ఖలేజాలో మొదట అనుకున్నా తర్వాత హ్యాండ్ ఇచ్చాడు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లిన పార్వతి మిల్టన్ మళ్లీ మహేష్ దూకుడుతో కాస్త తెరిపిన పడ్డది. ఇప్పుడు ఆమెను ఎలాగైనా ప్రమోట్ చెయ్యాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ అని సునీల్ సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. త్రివిక్రమ్ చాలా సంస్కారి అని ఇటువంటి విషయాలకు చాలా దూరమని ఇది కేవలం పనిపాటాలేని పరిశ్రమ జనం సృష్టి అని చెప్తున్నారు.

    అయితే తన సినిమాలో ఆమెను పెట్టుకోవటం కష్టమని అర్దమైన త్రివిక్రమ్ తనకు తెలిసిన వారికి రికమెండ్ చేస్తున్నారు. అవేమీ వర్కవుట్ కాకపోవటంతో ఇప్పుడు తన క్లోజ్ ప్రెండ్ సునీల్ ఆమె భాధ్యతని అప్పచెప్పాడు. ఆమెను ఎలాగైనా సునీల్ సరసన నటింపచేయాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకు సునీల్ పై ప్రెజర్ తెస్తున్నాడు. రెమ్యునేషన్ విషయంలో కావాలంటే తాను ఆమెతో మాట్లాడతానని, ఆమెను సునీల్ దర్శకులుకు, నిర్మాతలకు రికమెండ్ చేయమని కోరాడట. అయితే ఆమెను కేవలం ఐటం సాంగ్ లు అయితే ఇవ్వగలం కానీ నటన రాని ఆమెతో చేయించుకోలేమని సునీల్ నిర్మాతలు చేతులు ఎత్తేస్తున్నారుట. తను వెడ్స్ మను చిత్రం రీమేక్ లో అయినా ఆమెను తీసుకుంటే లుక్ వస్తుందని సునీల్ చెప్పినా దర్శక, నిర్మాతలు నో చెప్తున్నారుట. ఇలా సునీల్ తన స్నేహితుడు గర్ల్ ప్రెండ్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సునీల్ పూలరంగడు చిత్రంలో బిజీగా ఉన్నాడు. వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

    English summary
    With Parvathi Melton’s idea, Trivikram is said to be ask his best friend Sunil to rope her in his films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X