»   » ఇంతకాలానికి ... త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడా?

ఇంతకాలానికి ... త్రివిక్రమ్ రీమేక్ చేస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : త్రివిక్రమ్ ఎప్పుడో కెరీర్ ప్రారంభం రోజుల్లో నువ్వే కావాలి(మళయాళం రీమేక్) చేసారు. తర్వాత మళ్లీ ఎప్పుడూ రీమేక్ లు జోలికి పోలేదు. పవన్ తో చేసిన తీన్ మార్ చిత్రం రీమేక్ అయినా దానికి కేవలం డైలాగులతోనే సరిపెట్టారు. అయితే ఇప్పుడు మరో సారి ఆయన రీమేక్ కు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. అదీ వెంకటేష్ హీరోగా అని తెలుస్తోంది. గతంలో నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి వెంకటేశ్ చిత్రాలకు రచయితగా వర్క్ చేశాడు త్రివిక్రమ్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటికే బాడీగార్డ్, దృశ్యం వంటి మలయాళ రీమేక్స్ లో నటించిన వెంకటేశ్.. తాజాగా మరో మలయాళ సినిమాపై మనసుపట్టాడని సమాచారం. మమ్ముట్టి, నయనతార జంటగా ఇటీవల మలయాళంలో విడుదలై విజయం సాధించిన చిత్రం భాస్కర్ ది రాస్కెల్. బాడీగార్డ్ ఫేం సిద్ధిఖీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా తెరకెక్కించేందుకు రీమేక్ రైట్స్ తీసుకున్నారు సురేశ్ బాబు.

Trivikram Srinivas direct Venkatesh s Bhaskar The Rascal

అయితే ఈ రీమేక్ కు సంబంధించి.. దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు తెరపైకొచ్చింది. ఎన్టీఆర్ తో తాను చేయాల్సిన సినిమాకు మరికొన్ని నెలల సమయం ఉండడంతో ఈ లోపు ఈ సినిమా పూర్తిచేయాలనే ప్లాన్ లో త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం .

వెంకటేష్ కెరీర్ లో ఎక్కువ హిట్ లు రీమేక్ లతో వచ్చినవే. దాంతో ఆయన రీమేక్ అంటే వెంటనే ఉత్సాహం చూపించి రంగంలోకి దూకేస్తారు. తాజాగా అలాంటి రీమేక్ ఒకటి వెంకటేష్ కు దొరికిందని తెలుస్తోంది. ముందుగా రజనీకాంత్ తో అనుకున్న రీమేక్ ని ... ఇప్పుడు వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

రీసెంగ్ గా ఆయన ముమ్మట్టి, నయనతార కాంబినేషన్ లో రూపొందిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం చూడటం జరిగిందని, దాంతో ఆ చిత్రం రీమేక్ చేస్తే బాగుంటుందని ఆసక్తి చూపుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెప్తున్నారు.

మమ్ముట్టి - నయనతార జంటగా నటించిన ‘భాస్కర్ ది రాస్కెల్' అనే సినిమా ఈ ఏడాది ఏప్రిల్ లో మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. భాస్కర్ ది రాస్కెల్ రీమేక్ రైట్స్ ని సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాని వెంకటేష్ - నయనతారలతో తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

Trivikram Srinivas direct Venkatesh s Bhaskar The Rascal

ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఇంకా ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

మళయాళంలో సిద్దికి(బాడీగార్డ్ డైరక్టర్) డైరక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో వెంకటేష్ కి ప్రత్యేక స్క్రీనింగ్ వేసి చూపించారు. అయితే ఇందులో వివాహితుడుగా, ఓ బిడ్డకు తండ్రిగా వెంకటేష్ కనిపించాల్సి ఉంటుంది. అది అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుంది అనే విషయమై తర్జనభర్జనలు పడుతున్నారని చెప్పుకుంటున్నారు. వెంకటేష్ మాత్రం తన వయస్సుకు మ్యాచ్ అయ్యే సబ్జెక్టు అని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

భాస్కర్ ..ది రాస్కెల్ కథాంశం విషయానికి వస్తే...

భాస్కర్ (ముమ్మట్టి) పెద్దగా చదువుకోడు, చాలా ర్యాష్ గా ఉంటూంటాడు. కానీ మనస్సు మాత్రం చాలా మంచింది. తన తండ్రి పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించిన భాస్కర్ పెళ్లైన కొద్ది కాలంలోనే తన భార్యని పోగొట్టుకుంటాడు. తన కొడుకుతో ...ఓ పెద్ద బంగ్లాలో ఉంటూంటాడు భాస్కర్. తన తండ్రి ర్యాష్ గా ఉండి అందరితో తగువులు పడటం ఆ పిల్లాడికి ఇష్టం ఉండదు.

ఇక నయనతార విషయానికి వస్తే ఆమె చాక్లెట్స్ లు తయారు చేసే వ్యాపారం చేస్తూంటుంది. ఆమె కుమార్తె కూడా...భాస్కర్ కొడుకు చదువుతున్న స్కూల్ లోనే చదువుతూంటుంది. ఆమె కూడా ఒంటిరిగా ఉంటూంటుంది. ఇది గమనించిన పిల్లలు వారిని ఒకటిగా చేసి తన తల్లి, తండ్రులుగా మార్చుకోవాలనుకుంటారు. అయితే దీనికి నయనతార ఒప్పుకోదు. ఈ ప్రాసెస్ లో జరిగిన కామెడీనే కథాంశం.

English summary
According to reports Venkatesh shows great interest in remaking the recent Malayalam Hit Baskar The Rascal for Producer SS Durairaj. Trivikram Srinivas would direct it.
Please Wait while comments are loading...