»   » కరీనా కాపురంలో కరణ్ చిచ్చు.. నా కూతురు నా ఇష్టం.. సైఫ్

కరీనా కాపురంలో కరణ్ చిచ్చు.. నా కూతురు నా ఇష్టం.. సైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  బాలీవుడ్‌లో స్టార్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయట. అందుకు కారణం సైఫ్ కూతురు సారా ఆలీఖాన్, దర్శకుడు కరణ్ జోహర్ అందుకు కారణమట. తాను తీయబోయే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో సారాను తీసుకోవాలని ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ ప్రతిపాదన తెచ్చారట. అయితే కరణ్ చిత్రంలో సారా నటించడం కరీనాకు ఇష్టమైతే.. సైఫ్ ఆలీఖాన్‌కు నచ్చ లేదట. ఈ విషయంలో వారి వాదన భిన్నంగా ఉండటం వలన అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు సమాచారం.

   సారాకు కరణ్ అయితేనే మంచిది

  సారాకు కరణ్ అయితేనే మంచిది

  కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ఫిలిం ప్రొడక్షన్‌లో నటిస్తే సారా కెరీర్ ఆలియాభట్ మాదిరిగా దూసుకెళ్తుందనేది కరీర్ అభిప్రాయం. కరణ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన ఆలియా గ్రాఫ్ ఎలా దూసుకుపోయిందో అందుకు ఉదాహరణ అని సైఫ్‌కు కరీనా చెప్పిందట. ఆ విషయంపై సైఫ్ అసంతృప్తిని వ్యక్తం చేశాడట.

  హీరోయిన్లను కరణ్ బాగా చూసుకొంటాడు

  హీరోయిన్లను కరణ్ బాగా చూసుకొంటాడు

  బాలీవుడ్‌లో రాణించాలంటే కరణ్ లాంటి దర్శక, నిర్మాత సహకారం ఎంతో అవసరం. హీరోయిన్లను చాలా బాగా చూసుకొంటాడు. వారికి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా కరణ్ జాగ్రత్తలు తీసుకొంటాడు. ఇతర సినీ ప్రముఖులకు సారా తీసుకోమని సిఫారసు చేసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో సారా కెరీర్ కూడా ఆలియా భట్ మాదిరిగా ఉంటుందని సైఫ్‌కు కరీనా నచ్చచెప్పిందట.

  సారా కెరీర్ ఎవరిపై ఆధారపడవద్దు.

  సారా కెరీర్ ఎవరిపై ఆధారపడవద్దు.

  తన కూతురు సారా కెరీర్ ఎవరి జీవితంపై ఆధారపడకూడదనేది సైఫ్ వాదన. స్వయంగా కెరీర్‌ను సారానే డిజైన్ చేసుకోవాలని, ఒకరి ప్రభావం ఉండకూడదని ప్రస్తుతం చోటా నవాబ్ భావిస్తున్నాడు. అంతేకాకుండా ఆలియా అడుగు జాడల్లో నడువాల్సిన పని లేదంటున్నాడు సైఫ్.

  కరీనా జోక్యం చేసుకోకు..

  కరీనా జోక్యం చేసుకోకు..

  బాలీవుడ్‌లో సారా కెరీర్ విషయంలో ఎవరూ తలదూర్చకూడదని విషయాన్ని కరీనాకు సైఫ్ గట్టిగానే చెప్పాడట. దాంతో ఈ వ్యవహారంలో తన జోక్యం ఉండదని కరీనా వెల్లడించిందట. సారా వ్యవహారం పచ్చగా సాగుతున్న కాపురంలో కొంత అసంతృప్తి కలుగడానికి కారణమైందని వార్త బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్నది.

  కరణ్ దర్శకత్వంలో ఆలియా..

  కరణ్ దర్శకత్వంలో ఆలియా..

  బాలీవుడ్‌లో అగ్రదర్శకుడైన మహేశ్ భట్ కూతురు ఆలియాభట్ 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2 స్టేట్స్, హంప్టి శర్మ కి దుల్హనియా, కపూర్ అండ్ సన్స్, డియర్ జిందగీ, ఉడ్తా పంజాబ్ లాంటి విజయవంతమైన చిత్రాలు ఆలియాను అగ్ర హీరోయిన్‌గా నిలబెట్టాయి.

  కంటతడి పెట్టిన కరణ్

  కంటతడి పెట్టిన కరణ్

  వెండితెరమీద హీరోయిన్‌గా రాణించాలన్న తన కలను దర్శకుడు కరణ్ జోహార్ నిజం చేశాడని ఇటీవల ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఆలియా భట్ బహిరంగంగా చెప్పింది. కరణ్ లేకపోతే తన సినీ జీవితం ఇలా ఉండేది కాదని ఆమె వెల్లడించింది. అందుకు కరణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆలియా చెప్పింది. ఆలియా మాటలు విన్న కరణ్ అవార్డుల వేదికపై భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం గమనార్హం.

  English summary
  Saif Ali Khan's daughter Sara Ali Khan is all set to make her Bollywood debut with Karan Johar's Student Of The Year 2. This has become the reason of trouble between Saif and wife Kareena Kapoor Khan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more