»   » పూరీ జగన్నాధ్ సంసారంలో గొడవలా?

పూరీ జగన్నాధ్ సంసారంలో గొడవలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ది లవ్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. అలాగే దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారని చెప్పుకుంటారు. అయితే కొంత కాలంగా ఇద్దరి మధ్యా గొడవలు సాగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. భార్య లావణ్య పూరీని అనుమానిస్తోందని,అందుకే గొడవలు అవుతున్నాయని చెప్తున్నారు. అయితే పూరీ కూడా అందుకు తగ్గట్లే అమ్మాయిలతో బిహేవ్ చేస్తూంటాడని, బ్యాంకాక్ కి స్టోరీ డిస్కషన్స్ పేరుతో వెళ్ళి అక్కడ వేరే రకంగా బిజీగా ఉంటాడని చాలా కాలంగా వినపడుతోంది. ఆమె మంచి తనంతో ఇన్నాళ్ళూ భరించిందని, ఈ మధ్య కాలంలో ఆఫీస్ అమ్మేయటం, ఆర్ధికంగా దివాళా తీయటం ఆమెను బాగా నిరుత్సాహపరిచిందని అదే గొడవలకు మూలకారణం అవుతోందని అంటున్నారు. పూరీ ప్రవర్తనను అనుమానించి అస్తమానం ఆఫీసుకు వెళ్ళటం అతన్ని విసుగు రప్పించిందని, దాంతో ఆఫీస్ స్టాప్ ని మొత్తం మార్చేసాడని అంటున్నారు. అసలే వరస ఫ్లాప్ లతో దూసుకుపోతున్న పూరీకి ఇది ఊహించని పరిణామమని చెప్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్..గోలీమార్ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం బాలకృష్ణతో బెల్లంకొండ సురేష్ నిర్మాతగా చిత్రం చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరక్టర్ అయిన పూరీ జగన్నాధ్ త్వరగా ఈ సమస్యలనుంచి కోలుకుని మళ్ళా బిజీ కావాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu