twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు? ఉదయ్ కిరణ్ నోటికాడి కూడు లాక్కున్నారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆకలితో ఉన్న బిడ్డ నోటి దాకా వచ్చిన ముద్దను లాక్కుంటే.....పరిస్థితి ఎలా ఉంటుందో? ఆ బిడ్డ ఎలా విలవిలలాడుతాడో ప్రత్యేకంగా చూసిన వారికే అర్థమవుతుంది. ఉదయ్ కిరణ్ విషయంలోనూ అదే జరిగింది. ఆయన చేతిదాకా వచ్చిన సినిమాలు దూర మయ్యాయి. ఆయన హీరోగా ప్రారంభమై సినిమాలు సైతం కొంత వరకు చిత్రీకరణ జరిగి ఆగి పోయాయి. మరి ఎందుకు ఇలా జరిగింది? అంటే ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. కాదు కాదు....నిజం చెప్పే ధైర్యం ఎవరి దగ్గరా లేదు అనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

    సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ ప్రారంభించిన ఉదయ్ కిరణ్‌ జీవితం ఆ తర్వాత ఎందుకలా మోడబారి పోయింది? ఆయన ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలే ఏమిటి? సర్వత్రా ఇపుడు ఇదే చర్చ. ఉదయ్ కిరణ్ జీవితంతో కొన్ని శక్తులు ఆడుకున్నాయని ఆయకు సంతాపం తెలిపేందుకు వచ్చిన ఇండస్ట్రీలోని ప్రముఖులు సైతం బహిరంగంగా వ్యాఖ్యానించారంటే...ఆ మాటల వెనక అర్థం ఏమిటి?

    Uday Kiran

    పైకి చూస్తే......ఉదయ్ కిరణ్ సినిమాలు వరుస ప్లాపవ్వడం వల్లనే అతని కెరీర్ దిగజారి పోయిందని కనిపిస్తుంది. కానీ అతని కెరీర్ నాశనం అవ్వడం వెనక ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం ఉదయ్ కిరణ్‌తో అప్పట్లో ఓ సినిమా మొదలు పెట్టారు....ఆ చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తయిన తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయింది.

    ఈ సినిమా ఆగిపోయిన విషయమై సోషల్ నెట్వర్కింగులో ఆసక్తికర విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఓ పెద్దమనిషి వర్గం నుంచి వచ్చిన బెదిరింపుల వల్లే తాను ఆ సినిమా ఆపేసినట్లు ఎఎం రత్నం చెప్పినట్లు ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగులో ప్రచారం జరుగుతోంది.

    ఆర్థికంగా, రాజకీయంగా బలవంతుడైన సదరు సినిమా పెద్దమనిషికి భయపడి ఉదయ్ కిరణ్‌తో సినిమాలు చేయడానికి స్టార్ ప్రొడ్డూసర్లు, స్టార్ దర్శకులెవరూ ముందుకు రాలేదని.....ఆయనతో సినిమాలు తీసిన కొందరు చిన్న నిర్మాతలు ఆ సినిమాలు విడుదల చేసుకోలేక ఇబ్బందులు పడ్డారని, దీంతో ఆయనతో సినిమాలు చేయడానికే నిర్మాతలు, దర్శకులు భయపడే పరిస్థితి ఏర్పడిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.

    English summary
    Uday Kiran suicide behind talk. A section of politicians have made target mage Big star on Uday kiarn suicide incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X