»   » హాట్ హాట్: తుపాకి రాణిగా ఉదయభాను?

హాట్ హాట్: తుపాకి రాణిగా ఉదయభాను?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల బాలీవుడ్లో నటించిన 'క్వీన్', 'రివాల్వర్ రాణి' చిత్రాలు మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రెండు చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను తెలుగు, తమిళంలో రీమేక్ చేసేందుకు కూడా కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.

కాగా...రివాల్వర్ రాణి చిత్రంలో నటించేందుకు టాలీవుడ్ హాట్ యాంకర్ ఉదయభాను ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఈచిత్రాన్ని ఉదయభాను చూసిందని, సినిమాలో కంగనా రనౌత్ పోషించిన పాత్ర, సినిమా కాన్సెప్టు ఆమెకు చాలా నచ్చాయని అంటున్నారు. ఈ మేరకు ఈచిత్రాన్ని తెలుగులో తీస్తే నటించేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది.

Udaya Bhanu interested in Revolver Rani?

ఒక వేళ ఉదయభాను ఈ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.....కంగనా రనౌత్ మాదిరిగా బోల్డ్‌గా నటించాల్సి ఉంటుంది. అయితే ఉదయభాను అంత సాహసం చేస్తుందా అనే విషయం కూడా పలువురు ఫిల్మ్ మేకర్స్‌ను ఆలోచనలో పడేసింది. గతంలో ఆమె నటించి 'మధుమతి' చిత్రం విషయంలో జరిగిన సంఘటనను వారు గుర్తు చేసుకున్నారు.

ఇంతకు ముందు 'మధుమతి' చిత్రంలో నటించిన ఉదయభాను....ఆ చిత్రం విడుదల సమయంలో వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన ప్రమేయం లేకుండా తాను చేసినట్లు డూప్‌లతో హాట్ హాట్ సీన్లు చేయించారని ఉదయభాను ఆ మధ్య నానా హంగా చేసిన సంగతి తెలిసిందే.

English summary
Film Nagar source said tha, Udaya Bhanu is very interested in Revolver Rani. It seems Udaya Bhanu has seen the film and was totally impressed with Kangana’s performance as well as the concept of the film. She has reportedly expressed her interest in acting in a remake of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu