»   »  ఉదయభానుకి సినిమా చాన్సులు

ఉదయభానుకి సినిమా చాన్సులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Udayabhanu
టీవీ యాంకర్ ఉదయభానుకి ఉన్న "డిమాండ్" చాలా మందికి తెలిసిందే. యాంకర్ గా ఎక్కువ సంపాదించే అవకాశాలు లేకపోవడంతో ఆమె ఈవెంట్ మేనేజ్ మెంట్ లో భాగంగా కామెంటేటర్ గా వ్యవహరిస్తోంది. హైదరాబాద్ మియాపూర్ లో ఆమె కట్టుకున్న కలల ఇల్లు ఆమె శ్రమ ఫలితం.

ఉదయభాను ఇప్పుడు తెలుగు వెండితెరపై ఐటం గాళ్ గా స్ధిరపడాలనుకుంటోంది. తెలుగులో ఇప్పుడూ లీడీంగ్ ఐటం గాళ్ ముమైత్ ఖాన్ పారితోషికాన్ని భారీగా పెంచడంతో చిన్న నిర్మాతలు అభినయశ్రీ వంటి వారిని ఆశ్రయించవలసి వస్తోంది. అభినయశ్రీ కూడా అందరికీ అందుబాటులో ఉండకపోవడంతో కొందరు నిర్మాతలు ఉదయభానుని సంప్రదిస్తున్నట్టు తెలిసింది.

ఉదయభాను "ఆపదమొక్కుల వాడు" సినిమాలో ఐటం గాళ్ గా నటించింది. ఆ సినిమాలో ఆమెకు మంచి పేరు రావడంతో ఇప్పుడు సినిమాలో ఐటం సాంగ్ కు 6 లక్షలల్ రూపాయలు డిమాండ్ చేసే స్ధితికి ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. కొంచెం పొడగరి అయినా ఇతర అందచందాలు తక్కువగా ఉండడంతో ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X