»   » ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్: సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్వీట్, పక్కా అంటూ....

ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్: సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్వీట్, పక్కా అంటూ....

Posted By:
Subscribe to Filmibeat Telugu
ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్... ఉమైర్ సంధూ పక్కా అంటూ ట్వీట్..!

చాలా కాలం గానే ఒక రూమరొ నిజమో తెలియని న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. అదేమితంటే హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తే.అయితే అప్పట్లో ఈ న్యూస్ విన్నవాళ్ళలో చాలామంది ఈ వార్తని నమ్మలేదు. ఎందుకంటే బిల్లా సినిమా దగ్గరినుంచే ఈ ఇద్దరిమధ్యా ఏదో ఎఫైర్ నడుస్తోందంటూ వార్తలు వచ్చినా ఈ ఇద్దరూ అసలు ఆ రకమైన రిలేషన్ లో ఉన్నారూ... అని చెప్పటానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా కనిపించకపోవటమే.

 ఏది నిజమో, ఏది అబద్ధమో

ఏది నిజమో, ఏది అబద్ధమో

ఈ పరిస్థితుల్లో, ఏది నిజమో, ఏది అబద్ధమో అభిమానులకు అంతుబట్టకుండా తయారైంది. అంతే కాదు ఒకసారి అయితే, తన పెళ్లిపై, అనుష్కతో ఎఫైర్ ముడిపెడుతూ షికార్లు చేస్తున్న పుకార్లపై అదంతా గాలి వార్తే అంటూ ప్రభాస్ స్పందించాడు కూడా. ఓ నేషనల్ న్యూస్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ ఈ రెండు అంశాలపై చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయ్.

కంగారు పడాల్సిన అవసరం లేదు

కంగారు పడాల్సిన అవసరం లేదు

ఇప్పుడప్పుడే తనకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు కాబట్టి ఇక లేడీ ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని జోక్ చేశాడు ప్రభాస్. 'ఇక అనుష్కతో పెళ్లి విషయం అంటారా... అటువంటి గాసిప్స్ ఒకప్పుడు తనని బాధించేవి కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే అటువంటి రూమర్స్, గాసిప్స్‌ని ఇప్పుడు తాను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాను' అని స్పష్టంచేశాడు ప్రభాస్.

 జస్ట్ రూమర్ మాత్రమే అంటూ

జస్ట్ రూమర్ మాత్రమే అంటూ

సాధారణంగా ఏ హీరోయిన్‌తోనైనా రెండు కన్నా ఎక్కువ చిత్రాల్లో కలిసి నటిస్తే, ఆ ఇద్దరికీ ఎఫైర్స్ అంటగట్టడం ఇవాళ కొత్తేం కాదు కదా! అందుకే అటువంటి పుకార్లని పట్టించుకోవడం మానేశాను అని తనదైన స్టైల్లో వివరణ ఇచ్చాడు దాంతో ఇదంతా జస్ట్ రూమర్ మాత్రమే అంటూ లైట్ తీస్కున్నారు అటు ప్రభాస్ అభిమానులూ, ఇటు అనుష్క అభిమానులు కూడా..

 ఉమైర్ సంధు

ఉమైర్ సంధు

అయితే ఇప్పుడు ఒక న్యూస్ మళ్ళీ అదే స్థాయిలో వచ్చింది. ఈ సారి ఇది పుకారు మాత్రమే అంటూ తేలిగ్గా తీసుకోలేం. ఎందుకంటే... ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీరిద్దరికి సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ వెల్లడించాడు. వారిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేశాడు. వాళ్లిద్దరూ ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వెల్లడించాడు.

ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ

ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ

ఈ విషయాన్ని ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడని... వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో ప్రభాస్, అనుష్కల్లో ఎవరైనా చెబితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

English summary
AnushkaShetty & Prabhas close friend told me that they love & care each other & they are officially in relationship now..!!" Tweets Umair Sandhu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu