మహేష్ బాబుతో UTV సినిమా క్యాన్సిల్?

'1' సినిమా నష్టాల ప్రభావం....ఇపుడు మరో సినిమాపై పడింది. యూటీవీ సంస్థ మహేష్ బాబు, మిర్చి దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం UTV సంస్థ మహేష్ బాబు సినిమాతో సినిమా చేయడానికి భయడపుతోందని, ఇక ఆ సినిమా అటకెక్కినట్లే అని అంటున్నారు.
గతంలో మహేష్ బాబు నటించిన 'అతిథి' సినిమా వల్ల కూడా UTV సంస్థకు భారీగా బొక్కపడింది. గత అనుభవం, తాజాగా '1' సినిమా మూలంగా 'ఈరోస్' సంస్థకు ఏర్పడిన నష్టాలు చూసిన UTV సంస్థ మరోసారి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేదనే టాక్ వినిపిస్తోంది.
అయితే మహేష్ బాబు సన్నిహితులు మాత్రం మరో విధంగా వాదిస్తున్నారట. కొరటాల శివ స్క్రిప్టు వర్కు మహేష్ బాబును సంతృప్తి పరచలేదని, అందుకే ఈ విధంగా జరిగిందని అంటున్నారు. మరి ఇందులో ఎవరి వాదన నిజమో? తేలాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











