»   » హీరో సూర్య నెక్ట్స్ తెలుగు దర్శకుడుతో ఖరారు

హీరో సూర్య నెక్ట్స్ తెలుగు దర్శకుడుతో ఖరారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Suriya
  హైదరాబాద్: సూర్య తమ్ముడు కార్తీ తాజా చిత్రం బిర్యాని ప్రమోషన్ లో ..స్టూడియో గ్రీన్ బ్యాన్ త్వరలో ఓ స్టైయిట్ చిత్రం చేయనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో హీరో సూర్య. ఈ మేరకు దర్శకుడు వివి వినాయిక్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు లింగు స్వామి దర్సకత్వంలో సూర్య చిత్రం ఉంటుందనుకున్నారు కానీ...అది వివి వినాయిక్ చేతికి వచ్చిందని తెలుస్తోంది. పూర్తి స్ధాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది.

  ఇక ఇంతకాలం స్టార్స్ ని డైరక్ట్ చేసిన వివి వినాయిక్ ప్రస్తుతం కొత్త హీరోని డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందింస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. అయితే షూటింగ్ సమయంలో వినాయిక్ చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఓ పాట చిత్రీకరణ సమయంలో సీనియర్ అయిన సమంత తో కొత్త హీరో శ్రీనివాస్ ని బ్యాలెన్స్ చేయటం కష్టంగా మారిందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుస గుసలు వినపడుతున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ ని అందరనీ ఈ చిత్రం కోసం ఆయన సమకూర్చారు.

  వివి వినాయిక్ మాట్లాడుతూ... నేను బెల్లంకొండ సురేష్ కుమారుడుని లాంచ్ చేయటానికి కమిటయ్యాను. ఎందుకంటే ఆయన నా మొదటి నిర్మాత. ఆది సినిమాతో నాకు కెరీర్ ఇచ్చిన వ్యత్తి. అందుకో ఆయన కుమారుడు చిత్రాన్ని నేను మంచి స్క్రిప్టుతో చేయాలనుకుంటున్నాను. అందుకోసం చాలా కథలు విన్నాను...కానీ నన్ను ఏదీ తృప్తి పరచలేదు. నాకు నచ్చింది బెల్లంకొండ కు నచ్చలేదు. అయితే ఫైనల్ గా ఓ లైన్ ని ఓకే చేసుకున్నాం. దాంతో ముందుకు వెళ్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 20 నుంచి ప్రారంభమం చేసాం అన్నారు.

  బెల్లంకొండ సురేశ్ స్వయంగా నిర్మించే ఈ చిత్రంలో శ్రీనివాస్ సరసన స్టార్ హీరోయిన్స్ ల్లో ఒకరైన సమంత నటిస్తుండటం విశేషం.కొంత కాలం క్రితం రెండు నెలల పాటు తను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సురేశ్ అండగా నిలిచి ఆదుకున్నారనీ, ఆ కృతజ్ఞతతో శ్రీనివాస్ సరసన చేస్తున్నాననీ ఇప్పటికే సమంత తెలిపింది. కొంతకాలంగా శ్రీనివాస్ నటన, డాన్స్, ఫైట్స్ వంటి విభాగాల్లో చక్కని శిక్షణ తీసుకుంటూ వచ్చాడు.

  English summary
  V V Vinayak is going to wield megaphone for Studio Green banner project and will be directing Suriya. Earlier it was gossiped that Lingusamy’ is going to direct Suriya’s straight Telugu film but now Vinayak has grabbed this opportunity. Let’s wait for an official confirmation soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more