Just In
- 31 min ago
అదిరింది షో గుట్టురట్టు చేసిన యాంకర్: అందుకే ఆపేశారంటూ అసలు విషయం లీక్ చేసింది
- 2 hrs ago
విజయ్ దేవరకొండ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్: అందరూ అనుకున్న టైటిల్నే ఫిక్స్ చేశారు
- 2 hrs ago
టాలీవుడ్లో విషాదం: ప్రముఖ నిర్మాత కన్నుమూత.. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ వరకు!
- 3 hrs ago
రాజమౌళి - మహేశ్ మూవీ నుంచి షాకింగ్ న్యూస్: ఎవరూ ఊహించని పాత్రలో సూపర్ స్టార్
Don't Miss!
- Finance
పెట్రోల్, డీజిల్ ధరలు జంప్: హైదరాబాద్లో ఎంత ఉందంటే
- News
కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
- Sports
Brisbane Test: తొలిసారి ఐదేసిన సిరాజ్.. ఆసీస్ ఆలౌట్! టీమిండియా టార్గెట్ 328!
- Automobiles
టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో పెర్ఫార్మెన్స్ను చూపించే కొత్త టీజర్ విడుదల
- Lifestyle
మీ చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి ప్రతి ఉదయం దీన్ని తాగితే సరిపోతుంది ...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ తెలుగు హీరో కూడా విలన్ అవుతున్నాడు
హైదరాబాద్ : పెళ్లి, మనసిచ్చి చూడు, చాలా బాగుంది, నా ఊపిరి వంటి చిత్రాలల్లో హీరోగా నటించిన వడ్డే నవీన్ త్వరలో విలన్ గ కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నవీన్ ని విలన్ గా తీసుకున్నట్లు సమాచారం. శ్రీమతి కళ్యాణం చిత్రం తర్వాత వడ్డే నవీన్ ఏ చిత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు విలన్ గా తిరిగి లాంచ్ అవుతూ తన కెరిర్ ని పునర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, త్వరలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారట.
మనోజ్, వర్మలు ప్రస్తుతం స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్న వార్త నిజమే అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.

ఇక సంచలనం సృష్ఠించిన నిజ జీవిత కథలను ఎంచుకుని వాటిని సినిమాలుగా మార్చడంలో వర్మది అందెవేసిన చేయి. ముంబయి దాడుల ఉదంతంతో అటాక్స్ ఆఫ్ 26/11 తెరకెక్కించిన విషయం తెలిసిందే. అనేక విమర్శల మధ్య విడుదలైన ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. బెజవాడ నేపథ్యంతో తెరకెక్కించిన బెజవాడ రౌడీలు సినిమా అనేక విమర్శల తర్వాత 'బెజవాడ'గా పేరుమార్చి విడుదల చేశారు.
నిజ జీవిత నేపథ్యంతో రక్త చరిత్ర, రక్త చరిత్ర2, బెజవాడ రౌడీలు,అటాక్స్ ఆఫ్26/11 రూపొందించాడు వర్మ. ఇప్పుడు అదే కోవలో ఓ నిజ జీవిత నేపథ్యంలో ఓ సినిమా తీయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునందా పుష్కర్ మృతి ఆదారంగా సినిమా తీసేపనిలో ఉన్నట్లు తెలుస్తుంది.మొదట ఆత్మ హత్య అనుకున్నా ఆమెది హత్య అనే తేలింది.
కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద గత ఏడాది అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసుపై వర్మ కూడా స్టడీ చేస్తున్నట్లు సమాచారం. సునంద కేసు ఓ కొలిక్కి రాగానే సినిమా ప్రారంభిస్తారని వినికిడి.