థియేటర్స్ ఓపెన్ కాగానే బిగ్ స్క్రీన్‌పై పవన్ కళ్యాణ్ సినిమా.. సీనియర్ నిర్మాత కొత్త ప్లాన్!

తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మరోసారి సినిమాల హడావుడి మొదలు కాబోతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రేపో మాపో ఏపీలో కూడా పూర్తిగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు ఆగస్టు నుంచి రావచ్చని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో పవన కళ్యాణ్ సినిమా అందరికంటే ముందుగానే రానున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని

వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని

కరోనా వైరస్ కాస్త తగ్గడంతో మళ్ళీ షూటింగ్స్ తో ఇండస్ట్రీ సందడిగా కనిపించబోతోంది. థర్డ్ వేవ్ మొదలవ్వక ముందే షూటింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నిర్మాతలు దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు జులై మొదటివారంలోనే షూటింగ్స్ తో బిజీ కానున్నారు.

మరోసారి సస్పెన్స్

మరోసారి సస్పెన్స్

ఇక ఆదివారం నుంచి సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని క్లారిటీ వచ్చినప్పటికీ మళ్ళీ థియేటర్స్ సందడిగా కనిపిస్తాయా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ముందుగా కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలను రిలీజ్ చెయలని సిద్ధమవుతున్నారు. దీంతో ఎలాంటి సినిమాలు వస్తాయో.. అని సినీ లవర్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా

మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా

ఇక ఈ క్రమంలో ఒక స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ సినిమాను రీ రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. వకీల్ సాబ్ లో డిలిటెడ్ సీన్స్ ను యాడ్ చేసి మరోసారి విడుదల చేస్తారట. పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

పవర్ స్టార్ మీద నమ్మకంతోనే

పవర్ స్టార్ మీద నమ్మకంతోనే

అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు అంటే కేవలం పవర్ స్టార్ క్రేజ్ మీద నమ్మకంతోనే అని చెప్పవచ్చు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరోసారి థియేటర్ కు వచ్చి చూస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా కొత్త సీన్స్ ను యాడ్ చేస్తున్నారు అంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవ్వడం కాయం. మరి సెకండ్ టైమ్ రిలీజ్ అప్పుడు సినిమాకు కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X