»   » పాపం...జూ ఎన్టీఆర్ అతడికి మళ్లీ హ్యాండిచ్చాడు!

పాపం...జూ ఎన్టీఆర్ అతడికి మళ్లీ హ్యాండిచ్చాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా ప్రముఖ రచయితల్లో టాప్ 10లో వినిపించే పేరు వక్కతం వంశీ పేరు. ఆయన కథలు అందించిన కిక్, ఎవడు, రేసు గుర్రం, టెంపర్ లాంటి చిత్రాలు భారీ విజయం సాధించాయి. అఫ్ కోర్స్ ఆయన ఖాతాలో అశోక్, అదిథి, కళ్యాణ్ రామ్ కత్తి లాంటి పరమ ప్లాపు సినిమాలు కూడా ఉన్నాయనుకోండి.

రచయితలు దర్శకులు కావాలని ఆశ పడటం మామూలే. కొందరు ఆ దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు కూడా. మరికొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వక్కతం కూడా చాలా కాలంగా ఆశ పడుతున్నాడు. తనకు చాలా క్లోజ్ అయిన ఎన్టీఆర్ తన సినిమాకు దర్శకత్వం అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చాడు.

Vakkantham Vamsi to direct Venkatesh

వాస్తవానికి ‘టెంపర్' సినిమా తనే చేద్దామనుకున్నాడు వంశీ. కానీ ఎన్టీఆర్ మాట కాదనలేక పూరి అప్పగించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ కు సిద్ధమైన తారక్ ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీకి చాన్స్ ఇస్తానని ఇన్నాళ్లూ ఊరించాడు. కానీ చివరి నిమిషయంలో తారక్ మరోసారి వంశీకి హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జనతా గ్యారేజ్ తర్వాత పూరితో చేయాలని డిసైడ్ అయ్యాడట ఎన్టీఆర్. చేస్తే ఎన్టీఆర్ తోనే తొలి సినిమా చేయాలని ఇన్నాళ్లు ఎదురు చూసి వక్కతం వంశీ .....ఇక ఎన్టీఆర్ కోసం ఎదురు చూడటం దండగ, అతడు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే ఆలోచిద్దా మని ఫిక్స్ అయ్యాడట. తాను కూడా వేరే హీరోల వైపు దృష్టి సారించాడు. అందుకే విక్టరీ వెంకటేష్ కు ఓ కథ వినిపించి మొదటి సినిమా వెంకటేష్ తో తీసేందుకు సిద్ధమయ్యాడట.'

English summary
Writer Vakkantham Vamsi, known for hits like Temper and Racegurram, is turning director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu