»   » చివరకు అఖిల్ భవిష్యత్తును ఆ డైరెక్టర్ చేతిలో పెట్టారు!

చివరకు అఖిల్ భవిష్యత్తును ఆ డైరెక్టర్ చేతిలో పెట్టారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ ఎంట్రీ చాలా గ్రాండ్ గానే జరిగింది. సినిమా విడుదల వరకు అఖిల్ పై అంచనాలు భారీగా ఉండేవి....అయితే సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో హైప్ కాస్త చల్లబడి పోయింది. తన కొడుకు తొలి చిత్రం భారీ విజయం సాధించాలని నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఘోరం జరిగిపోయింది.

తొలి సినిమా విషయంలో కొన్ని విషయాల్లో అతి పోకడలకు పోవడం వల్లనే అలా జరిగటిందని భావిస్తున్న నాగార్జున.... రెండో సినిమా విషయంలో మాత్రం అలా ఉండకూడదని భావిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ రెండో సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడిగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్ లో అఖిల్ 2వ సినిమా ప్రారంభం అవుతుందని టాక్.

 Vamsi Paidipalli Confirmed For Akhil's Next Movie

ఈ సినిమా కోసం ఆల్రెడీ నాగార్జున వంశీ పైడిపల్లికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడని, డైరెక్టర్ ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ మీద ఫోటో షూట్ నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ ను డిఫరెంట్ గా చూపించేందుకు వంశీ పైడిపల్లి సిద్ధమైనట్లు సమాచారం.

ఊపిరి సినిమా షూటింగ్ సమయంలో వంశీ పైడిపల్లి పనితీరుకు ఫిదా అయిన నాగార్జున.... అఖిల్ 2వ సినిమా బాధ్యతలు అతనికే అప్పగించాలని నిర్ణయించుకున్నాడట. అఖిల్ రెండో సినిమా విషయంలో నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో తానే నిర్మిస్తున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలో నాగార్జున ఇన్వాల్వ్ ఉండబోతోందని అంటున్నారు. ఇది అఖిల్ భవిష్యత్తును నిర్ణయించే సినిమా కాబోతోంది.

English summary
Vamsi Paidipalli has been confirmed as the director for Akhil's second movie, which will be launched formally in April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu