»   » జూ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ...!?

జూ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు" చిత్రంలో టాలీవుడ్ మీడియాలోని కొన్ని క్యారెక్టర్స్ ని తీసుకుని వారిపై సెటైర్స్ వేస్తూ వారిపై కక్ష తీర్చుకోబోతున్నాడు వర్మ. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన బ్రోచర్ ని రిలీజ్ చేసాడు. తన చిత్రంలోని క్యారెక్టర్స్ ఎలాంటివి, వారు ఎలాంటివారో తెలుపుతూ వారి గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఆ బ్రోచర్ వుంది.

తాతల కాలం నుంచి వంశపారం పర్యంగా స్టార్ డమ్ వున్న కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో యాక్చువల్ గా రియల్ లైఫ్ లో రియల్ విలన్...గా బాబుగారు పాత్రలో ఆదర్శ్ నటించాడు. ఈ క్యారెక్టర్ ని, ఆ డిజైన్ లోని లైన్స్ ని చదివితే..యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి పెట్టుంటాడని అర్థమవుతోంది. తాతను అభిమానిస్తూ, గౌరవిస్తూ తిరుగులేని హీరోగా ఎదిగిన జూ ఎన్టీఆర్ ని రియల్ లైఫ్ లో విలన్ గా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా గొడవలు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన రక్తచరిత్ర చిత్రాల్లో మాత్రం ఎన్టీఆర్ లాంటి క్యారెక్టర్ ని ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా చూసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు" 'అప్పల్రాజు" చిత్రంలో జూ ఎన్టీఆర్ పై ఇలా విరుచుకుపడటం చూస్తుంటే పెద్ద అలజడి సృష్టిస్తుందేమో..?

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu