Don't Miss!
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
‘పుష్ప’లో మరో క్యూట్ హీరోయిన్: అల్లు అర్జున్‌ను క్రూరంగా మార్చే క్యారెక్టర్ ఇదేనట
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా బాట పడుతున్నారు. మన ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోలు మిగిలిన భాషల్లోనూ సత్తా చాటాలన్న లక్ష్యంతో వరుసగా అలాంటి సినిమాలే చేయాలని భావిస్తున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప.. ద రైజ్' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
Bigg Boss: సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ బండారం బట్టబయలు.. షోలో అడ్డంగా బుక్కైన ప్రేమికులు
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పుష్ప' మూవీని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగానికి సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తైంది. అలాగే, రెండో పార్ట్ కోసం దాదాపు 30 శాతం చిత్రీకరణ జరిపారు. ఇప్పుడు మొదటి దాని కోసం షూట్ చేస్తున్నారు. ఇక, మొదటి భాగాన్ని 'పుష్ప.. ద రైజ్' పేరిట వచ్చే క్రిస్టమస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం 'పుష్ప' మూవీ షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో శరవేగంగా జరుగుతోంది. దాదాపు రెండు వారాలుగా జరుగుతోన్న ఈ షెడ్యూల్‌లో హీరోపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ సాఫ్ట్ మెలోడీ పాటను కూడా షూట్ చేస్తున్నారు. ఈ పాటను టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నాడు. తాజాగా బన్నీతో ఆయన దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే, అల్లు అర్జున్ రంపచోడవరం ఏరియాలోని రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న హోటల్‌లో టిఫిన్ చేసిన వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.
పవన్ కల్యాణ్ సెన్సేషనల్ రికార్డ్: ఒకే సినిమాతో రెండు ఘనతలు సొంతం.. ఇండియాలోనే ఏకైక హీరో
తాజాగా 'పుష్ప' మూవీ నుంచి ఓ ఆసక్తికరమై వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ, 'మిడిల్ క్లాస్ మెలోడీస్' హీరోయిన్ వర్ష బొల్లమ్మ కూడా నటిస్తుందట. అది కూడా అల్లు అర్జున్ సోదరి పాత్ర అని సమాచారం. ఈ రోల్ గురించి మరిన్ని వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఈ పాత్రను విలన్‌లు అత్యాచారం చేసి చంపేస్తారట. దీంతో హీరో క్రూరంగా మారిపోయి వాళ్లపై పగ తీర్చుకుంటాడని తెలుస్తోంది. ఈ పాత్ర చనిపోయే సన్నివేశాలు ఎంతో భావోద్వేగంగా సాగుతాయని అంటున్నారు. అందుకే ఈ పాత్రకు ఇనోసెంట్‌గా కనిపించే వర్షను ఎంపిక చేసుకున్నారని తెలిసింది.

'పుష్ప' మూవీలో అల్లు అర్జున్ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. లారీ డ్రైవర్ స్థాయి నుంచి డాన్‌గా ఎలా ఎదిగాడన్న నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ పాత్ర కోసం అతడు ఎన్నో సాహసలు చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది.