»   » అల్లు అర్జున్ 'వరుడు' స్టోరీ లైన్ అదేనా?

అల్లు అర్జున్ 'వరుడు' స్టోరీ లైన్ అదేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న వరుడు చిత్రం కథ కిడ్నాప్ డ్రామా చుట్టూ తిరుగుతుందని వినపడుతోంది. హీరోయిన్ పెళ్లి జరుగుతూండగా ఆమెని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళతారు. అప్పుడు ఆ పెళ్ళి కొడుకు ఆమె కోసం వెతుకుతూ వెళ్లతాడు అని తెలుస్తోంది. అయితే కథలో ఎక్కువ భాగం పెళ్లి నేపద్యంలో జరుగుతుంది. సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ తాతగా ఓ కీలకమైన రోల్ లో కనపడనున్నాడు. యూనివర్సిల్ స్టూడియో బ్యానర్ పై ఈ చిత్రాన్ని గుణశేఖర్ రూపొందిస్తున్నాడు. డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఆర్.డి.రాజశేఖర్ కెమెరా అందిస్తున్న ఈ చిత్రానికి వేటూరి లిరిక్స్ అందిస్తున్నారు. ఆర్ట్ దర్శకత్వం అశోక్ చేస్తున్నాడు. ఇక ఒక్కడు, సైనికుడు, అర్జున్, మనోహరం వంటి చిత్రాలతో టెక్నికల్ దర్శకుడుగా పేరుతెచ్చుకున్న గుణశేఖర్, అల్లు అర్జున్ కాంబినేషన్ కావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక నిర్మాతలు ఇంతకు ముందు అల్లు అర్జున్ తో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో దేశముదురు చిత్రాన్ని రూపొందించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu