»   » అల్లు అర్జున్ 'వరుడు' దెబ్బకు థియేటర్ క్లోజ్!?

అల్లు అర్జున్ 'వరుడు' దెబ్బకు థియేటర్ క్లోజ్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుణశేఖర్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా వచ్చిన "వరుడు" రిలీజైన నాటినుంచే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లాఫ్ ఎఫెక్టు డిస్ట్రిబ్యూటర్స్ మీద ఏ రేంజిలో పడిందో తెలియదుకానీ చిత్రం ఆడిస్తున్న మెయిన్ ధియోటర్ (హైదరాబాద్..ఆర్టిసి క్రాస్ రోడ్స్) పై పడిందని సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాని ప్రకారం...చతికిలపడిన "వరుడు" చిత్రాన్ని ముందే చేసుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం తప్పనిసరిగా ప్రదర్శించవలసి వస్తోందిట. రెండోవారం నుండి 30శాతం వసూళ్లతో సినిమాని నడపలేక పోతున్న యాజమాన్యం ఆ సినిమాని వదిలించుకునే ఉద్దేశంతో రేనోవేషన్ పేరుతో మొత్తం హాలునే మూసి పారేసారని చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu