»   » అల్లు అర్జున్ 'వధువు' ఎవరో తెలుసా..? అమృతసర్ అమ్మాయి..?!

అల్లు అర్జున్ 'వధువు' ఎవరో తెలుసా..? అమృతసర్ అమ్మాయి..?!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ దర్శకుడిగా యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం 'వరుడు" ఈ నెల 31 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది ఇప్పటికైనా 'వధువు" ఎవరనే విషయాన్ని చెప్పలేనని నిర్మాత శనివారం నాడు మీడియాతో చెప్పారు. వధువు గురించి రకరకాల కథనాలు వస్తున్నాయని, సినిమాలో ఇంటర్ వెల్ కు ముందే వధువును చూపిస్తామని అన్నారు. వధువు పాత్ర పోషించిన అమ్మాయి అమృతసర్‌కు చెందిందని మాత్రం చెప్పారు. ఆమె నటీమణా? కాదా? అనే రిలీజ్ నాడే తెలియజేస్తామని నిర్మాత అన్నారు. అసలు హీరో కూడా పెండ్లి చూపుల్లోనే ఆ అమ్మాయిని చూస్తాడని, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం, పెండ్లి తంతు ఐదు రోజులు జరగడం నేపథ్యంలో 'వరుడు" సినిమా రూపొందిందని నిర్మాత వెల్లడించారు. దాదాపు 300 ప్రింట్టతో సినిమాను విడుదల చేస్తున్నామని, పెండ్లితంతుపై చాలా చిత్రాలు వచ్చిన ఇంత వైవిద్యంగా ఏ చిత్రమూ రాలేదని నిర్మాత చెప్పారు. అల్లు అర్జున్ కెరీర్ లో వసూళ్ళ పరంగా 'వరుడు" రికార్డు బ్రేక్ చేస్తాడని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రహ్మానందం, నరేష్, సుహాసిని, షాయాజి షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా రాజశేఖర్, మాటలు తోటప్రసాద్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu