»   » కాస్త నటన నేర్చుకుని డ్యూయిల్ రోల్ చెయ్యిబాబు

కాస్త నటన నేర్చుకుని డ్యూయిల్ రోల్ చెయ్యిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Sandesh's Dule role for Lava Kusa
హైదరాబాద్: ద్విపాత్రాభినయం ప్రతీ హీరోకి కలిసివస్తుందనే నమ్మకం లేదు. ఎందుకంటే రెండు పాత్రల్లోనూ వేరియేషన్ చూపించి మెప్పించగలిగితే డ్యూయిల్ రోల్ సీన్స్ పండుతూంటాయి. రీసెంట్ కథ డిమాండ్ చేయకపోయినా ద్విపాత్రాభినయం పై మోజుతో అల్లరి నరేష్ ...జంపు జిలాని చేసి,డిజాస్టర్ ఫలితం సాధించాడు. ఇప్పుడు వరుణన్ సందేశ్...లవ కుశ టైటిల్ తో రెడీ అవుతున్న చిత్రంలో హీరోగా చేస్తున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేసి అలరించబోతున్నాడట. డ్యూయిల్ రోల్ చేసే హీరోలకు కాస్త నటనపై గ్రిప్ ఉండాలి. ఒకే విధమైన ఎక్సప్రెషన్,డైలాగు డెలవరీతో కెరీర్ ప్రారంభం నుంచి లాక్కొస్తున్న వరుణ్ సందేశ్ కి ఇది అవసరమా అంటున్నారు.

ఇందులో క్యాబ్ డ్రైవర్ గా వరుణ్ సందేశ్ కనిపిస్తాడని చెప్తున్నారు. పార్టీల నుంచి ఇళ్లకు వెళ్లే వారిని జాగ్రత్తగా దింపే పనిలో ఉంటాడట. ఈ నేపధ్యంలో ఓ పికప్ లో అతనికి తనలాంటి మరో కుర్రాడు కనపడటంతో కథ మొత్తం మారిపోతుందని చెప్తున్నారు. ఈ సినిమా మీద వరుణ్ చాలా ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. చాలా ఎక్సైటింగ్ గా చేస్తున్నాడని అంటున్నారు. హిట్ కొడితే ...వరస ఫ్లాఫ్ ల నుంచి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అయితే ఎంతవరకూ ఈ ద్విపాత్రాభినయం అతని కెరీర్ కి సపోర్టు చేస్తుందనేది చూడాలి. ఈ చిత్రంలో రిచా పనోయ్ హీరోయిన్ గా చేస్తోంది. జయశ్రీ శివన్ దర్శకత్వంలో చిత్రం రూపొందుతోంది. ప్రకాష్,సుబ్బారెడ్డి

'హ్యాపీడేస్', 'కొత్తబంగారులోకం' చిత్రాలతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత 'ఎవరైనా ఎపుడైనా', 'కుర్రాడు', 'మరోచరిత్ర' నుంచి వరస పెట్టి ఫ్లాపుల కొడుతూనే ఉన్నారు. దాదాపు శాటిలైట్ హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వరుణ్ సందేశ్ చిత్రానికి 'పడ్డానండీ ప్రేమలోమరి' అనే టైటిల్ ని పెట్టి సినిమా ప్రారంభించారు.

వరుణ్‌ సందేశ్‌, వితిక శేరు జంటగా రూపొందుతున్న చిత్రం 'పడ్డానండీ ప్రేమలోమరి'. మహేష్‌ ఉప్పుటూరి దర్శకత్వం వహిస్తున్నారు. నల్లపాటి రామచంద్రప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత ఎమ్‌.వి.ఎస్‌.హరనాథరావు క్లాప్‌నిచ్చారు. నిర్మాత పోకూరి బాబురావు గౌరవ దర్శకత్వం వహించారు.

దర్శకుడు మాట్లాడుతూ ''ప్రేమ, కుటుంబ సంబంధాలు కలగలిపిన కథ ఇది. ఆద్యంతం నవ్విస్తూ.. చివర్లో చక్కటి సందేశాన్నిచ్చేలా ఉంటుంది'' అన్నారు. ''నేటితరం యువతకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. వినోదానికి ప్రాధాన్యముంటుంది'' అన్నారు నిర్మాత. ఈ చిత్రంలో అరవింద్‌, తాగుబోతు రమేష్‌, ఎమ్మెస్‌ నారాయణ, తెలంగాణ శకుంతల, రక్ష, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి ఛాయాగ్రహణం: భరణి కె.ధరణ్‌, సంగీతం: ఎ.ఆర్‌.ఖద్దూస్‌, కూర్పు: ప్రవీణ్‌ పూడి, కళ: కుమార్‌

English summary

 Varun Sandesh is playing a dual role in the upcoming Tollywood entertainer titled Lava Kusha.Richa Panai will be one of the two heroines in this film and the shooting has already started.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu