రిస్క్ చేయడానికి సిద్దమవుతున్న వరుణ్ తేజ్.. ఆయన వద్దన్న కథతో?

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న గని అనే ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి చానల్లో అవుతున్నా సినిమా మాత్రం కొలిక్కి రావడం లేదు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో మొదలయిన ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 అనే సినిమా కూడా ప్రారంభించారు.

ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు సగం వరకు పూర్తయింది. అయితే కరోనా మహమ్మారి తగ్గి షూటింగ్ మొదలయితే కనుక ఈ రెండు సినిమాల షూటింగులు ఏకకాలంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో వరుణ్ తేజ్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా మీద ఫోకస్ పెట్టాడు. చలో సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి భీష్మ సినిమాతో రెండో హిట్ కొట్టిన వెంకీ కుడుముల తాజాగా రామ్ చరణ్ ను ఒక కథతో అప్రోచ్ అయ్యారు.

Varun Tej accepeted a story recejted by Ram Charan

అయితే రెండు మూడు సిట్టింగ్స్ పూర్తయిన తర్వాత రామ్ చరణ్ ఈ కథ మనకు సూట్ కాదని సున్నితంగా తిరస్కరించి వేరే ప్రాజెక్టులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాడు. అయితే అదే కథతో వరుణ్ తేజ్ ను వెంకీ కుడుముల సంప్రదించగా ఆ కథ వరుణ్ తేజ్ కి బాగా నచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ కథను మార్చే పనిలో వెంకీ కుడుముల పడ్డారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ లైన్ అప్ లో ఉన్న రెండు ప్రాజెక్టులు పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X