»   » ఖరారు: వరుణ్ తేజ, శర్వానంద్ కాంబినేషన్ లో దిల్ రాజు

ఖరారు: వరుణ్ తేజ, శర్వానంద్ కాంబినేషన్ లో దిల్ రాజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్నే ముకుంద చిత్రంతో పరిచయమైన వరుణ్ తేజ, శర్వానంద్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. దిల్ రాజు,పొట్లూరి వరప్రసాద్ నిర్మాతగ రూపొందనున్న ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్ ఫేమ్...వేణు శ్రీరామ్ డైరక్ట్ చేయనున్నారు. ఇంతకీ ఈ చిత్రం ఏమిటీ అంటారా... 'బెంగళూర్‌ డేస్‌' చిత్రం రీమేక్. మలయాళంలో అంజలిమీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డును సష్టించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మలయాళంలో విజయం సాధించిన చిత్రం 'బెంగళూర్‌ డేస్‌'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్‌ చేస్తున్నారు. తెలుగులో వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తారు. తమిళంలో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

గత కొంతకాలంగా ఈ రీమేక్‌లో ఎవరు నటిస్తారు? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నటీనటుల కోసం అన్వేషణ సాగుతోంది. ఈ ప్రయత్నం ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగులో వరుణ్‌తేజ్‌, శర్వానంద్‌లు కథానాయకులుగా నటించే అవకాశం ఉంది.

Varun Tej in Bangalore Days remake?

నిత్య మేనన్‌ను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. తమిళంలో రానా, ఆర్య, శ్రీదివ్యలు ప్రధాన పాత్రలు పోషిస్తారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెప్పుకొంటున్నాయి. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

తెలుగు, తమిళ భాషలలో రీమేక్ కానున్న ‘బెంగళూరు డేస్' సినిమాలో హీరో హీరోయిన్లుగా ఒకప్పటి ప్రేమజంట సిద్దార్ధ్, సమంత నటిస్తారని మొదట ప్రచారం జరిగింది. బ్రేక్ అప్ అయిన తర్వాత వీరిద్దరూ ఆ సినిమాలో నటించడం లేదని సోషల్ మీడియాలో ప్రకటించారు. దాంతో, హీరో హీరోయిన్ల ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. శర్వాకు తెలుగు, తమిళ భాషలలో మంచి గుర్తింపు ఉండడంతో దర్శకనిర్మాతలు అతన్ని సంప్రదించారు అని సమాచారం. రీసెంట్ గా విడుదలైన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', శర్వానంద్ కు మంచి విజయం అందించింది.

English summary
Varun Tej, son of Nagababu, who made his debut a few months back with Mukunda, is all set to star in a multi-starrer. The remake of Bangalore Days has Sharwanand as one of the leads and according to a source, producer Dil Raju has approached Varun Tej to play one of the other leads in the film.
Please Wait while comments are loading...