»   » ఖాకీ డ్రస్ వేయబోతున్న వరుణ్ తేజ, కలిసొస్తుందా

ఖాకీ డ్రస్ వేయబోతున్న వరుణ్ తేజ, కలిసొస్తుందా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోలకు పోలీస్ డ్రస్ వేయాలంటే భలే ఇష్టం. పోలీస్ డ్రస్ వేసి న్యాయం, ధర్మ రక్షించేయాలని తపన పడుతూంటారు. అందుకేనేమో దాదాపు మన తెలుగు చిన్నా, పెద్ద హీరోలందరూ పోలీస్ డ్రస్ వేసేసారు. అఢపదడపా హీరోయిన్స్ కూడా పోలీస్ డ్రస్ లో కనిపించారు. ఇప్పుడు వరుణ్ తేజ కూడా అదే రూట్ ని ఎంచుకున్నట్లు సమాచారం.

శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్ లో రూపొందనున్న మిస్టర్ చిత్రంలో వరుణ్ తేజ పోలీస్ డ్రస్ లో కనిపించనున్నారని సమాచారం. గతంలో శ్రీను వైట్ల దర్సకత్వంలో వచ్చిన ఆగడులో మహేష్ బాబు, బాద్షాలో ఎన్టీఆర్, బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ సైతం ఖాఖీ డ్రస్ లో కనిపించారు. క్యారక్టర్ ప్రకారం వాళ్లు పోలీస్ డ్రస్ వేసి కనిపించారు.

Also Read: పోలీస్ డ్రస్ లో ఏ హీరో బాగున్నాడు? (ఫొటో ఫీచర్)

'ఠాగూర్' మధు, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సూపర్ హిట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ ని అందించిన శ్రీను వైట్ల తనదైన శైలిలో విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Varun Tej is fourth one to wear a Khaki

లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో వరుణ్ తేజ్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్స్ నటించనున్నారు. ఏప్రిల్ 8 ఉగాది పర్వదినం నాడు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినా, రెగ్యులర్ షుటింగ్ మాత్రం ఇప్పటివరకూ స్టార్ట్ కాలేదు.

మరో ప్రక్క వరుణ్ తన కాస్ట్యూమ్ డిజైనర్‌తో కలిసి దుబాయ్ లో షాపింగ్ చేస్తున్నాడు. అందుకు సంబందించి ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. మిస్టర్ మూవీలో తెలివైన కుర్రాడి పాత్ర పోషించనున్న వరుణ్ తేజ్ అందుకు తగ్గట్టు డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటున్నాడు.

అదీ కాక ఈ చిత్ర షూటింగ్ దాదాపు స్పెయిన్‌లోనే జరగనుంది. అందుకోసం కాస్త రిచ్ లుక్‌ని మెయింటైన్ చేసేందుకు ఈ మెగా హీరో తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇదే కాక శేఖర్ కమ్ముల మూవీని కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళాలని వరుణ్ భావిస్తున్నాడు. ఇందులో వరుణ్ అమెరికా అబ్బాయిగా కనిపించనున్నాడు.

వరుణ్ తేజ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ కథ ఇదనీ, శ్రీను వైట్ల, వరుణ్ తేజ కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం క్లాస్ నీ, మాస్ నీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని కూడా చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్ ('కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్).

English summary
Mega hero Varun Tej is now getting ready to wear Khaki dress for Srinu Vytala movie and he will be the fourth hero to do such.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X