నాగబాబు కొడుకు ప్రాజెక్టుకి మళ్లీ బ్రేకులు

చిరంజీవి కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నారనగానే అందరిలో ఆసక్తి పెరిగింది. దర్శకుడు ఎవరై ఉంటారుఅనేది మొదటి నుంచి హాట్ టాపిక్ గా మారింది. మొదట శ్రీకాంత్ అడ్డాల ని అనుకున్నారు. కాని పర్శనల్ కారణాల వల్ల అతను తప్పుకోవటంతో పూరీ ని అనుకున్నారు. పూరీ వెళ్లి స్టోరీ నేరేట్ చేసారని కూడా వినపడింది. అయితే అనుకోని విధంగా ఈ మార్పు జరిగింది. అందుకే పూరీ హడావిడిగా నితిన్ తో హార్ట్ ఎటాక్ చిత్రం ప్రకటించాడని అంటున్నారు.
ఇక క్రిష్ విషయానికి వస్తే ....ఆయన మహేష్ తో చేయబోయే శివం చిత్రం 2014లో ఈ చిత్రం మొదలుకానున్నదని తెలుస్తోంది. 2013 చివరలో ఈ చిత్రం పూజతో ప్రారంభం చేసి...2014 ప్రారంభంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే మహేశ్, సోనాక్షి జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు నిర్మాత సి. అశ్వనీదత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











