»   » 2 ప్రాజెక్టులు ఆగిపోయాయి...అందుకే బన్ని తో

2 ప్రాజెక్టులు ఆగిపోయాయి...అందుకే బన్ని తో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజతో అనుకున్న రెండు ప్రాజెక్టులు అనుకోని విధంగా వెనక్కి వెళ్లాయి. దాంతో ఒక్కసారి డైలమోలో పడ్డ వరుణ్ తేజ ఓ యూత్ లవ్ స్టోరీతో ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడని, ఆ మేరకు ప్రిపేర్ అవుతున్నాడని సమచారం.

క్రిష్ తో అనుకున్న రాయబారి చిత్రం బడ్జెట్ సమస్యలతో పట్టాలు ఎక్కే పరిస్ధితి కనపడటం లేదు. జార్జియాలో లొకేషన్స్ స్కౌంటింగ్ చేసుకుని వచ్చిన క్రిష్... సినిమా బడ్జెట్ ఇరవై కోట్లు వరకూ అవుతుందని అంచనా వేసి, ప్రక్కన పెట్టేసినట్లు సమాచారం.

ఇక గోపిచంద్ మలినేని తో అనుకున్న సినిమా కూడా ఇప్పుడు వెనక్కి వెల్లిపోయింది. గోపీచంద్ మలినేని ...బడ్జెట్ ఎక్కువ అవటంతో అందుకు తగ్గ మార్కెట్ లేదని భావించి సాయి ధరమ్ తేజను ట్రై చేస్తున్నాడు.

Varun Tej next movie Feel My Love

దాంతో వరుణ్ తేజ..ఇధి కాదు పద్దతి అని ముందు యూత్ లో క్రేజ్ తెచ్చుకోవాలని ఓ లవ్ స్టోరీని ఓకే చేసారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఫీల్ మై లవ్ అనే టైటిల్ పెట్టారు.

అల్లు అర్జున్ కెరీర్ లో హిట్ గా నిలిచిన ఆర్య లో పాట పల్లవి అది. ఈ టైటిల్ తో , లవ్ స్టోరీ తో మళ్లీ యూత్ హీరోల సరసన నిలబడాలని ట్రాక్ లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్స్ స్దాయిలో ఉన్న ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

English summary
Varun Tej’s new movie with romance as the basic element is going to have this title of ‘Feel My Love.’Debutant director cum writer Venky Atluri is going to helm the project for Dil Raju production house.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu