»   » వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ టైటిల్ ‘తొలి ప్రేమ’..?

వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ టైటిల్ ‘తొలి ప్రేమ’..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Tej Next Movie Title పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ టైటిల్

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ 'ఫిదా'తో తన కెరీర్లోనే ది బెస్ట్ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిదా తర్వాత వరుణ్ రొమాంటిక్ ఎంటర్టెనర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వెంకీ ఆట్లూరి దర్శకత్వం వహిస్తారట.

ఈ చిత్రానికి 'తొలి ప్రేమ' అనే టైటిల్ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇదే టైటిల్ పెడతారా? లేక మారుస్తారా? అనేది ఫైనల్ కావాల్సి ఉంది. వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ 1998లో చేసిన 'తొలి ప్రేమ' చిత్రానికి, వరుణ్ తేజ్ చేయబోయే చిత్ర కథకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది.

పబ్లిసిటీ కోసమే ఆ టైటిల్

పబ్లిసిటీ కోసమే ఆ టైటిల్

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తొలి ప్రేమ'. వరుణ్ తేజ్ సినిమాకు ఈ టైటిల్ పెట్టడం ద్వారా పబ్లిసిటీ పరంగా బాగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

సెన్సబుల్ లవ్ స్టోరీ

సెన్సబుల్ లవ్ స్టోరీ

వరుణ్ తేజ్ చేయబోయే సినిమా స్టోరీ ఒక సెన్సబుల్ లవ్ స్టోరీగా ఉంటుందని, కథ ప్రకారం ఫస్ట్ లవ్ నేపథ్యంలో ఉంటుందని..... ఈ కథకు ‘తొలిప్రేమ' అనే టైటిల్ అయితేనే బావుంటుందని అంటున్నారు.

రాశి ఖన్నా హీరోయిన్

రాశి ఖన్నా హీరోయిన్

ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్‌‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. జ్యోతిర్మ‌యి గ్రూప్స్ చిత్ర స‌మ‌ర్ప‌కులు.

లండన్లో భారీ షెడ్యూల్

లండన్లో భారీ షెడ్యూల్

ఈ చిత్రానికి సంబంధించి లండన్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 35 రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేయనున్నారు. వచ్చే చిత్ర యూనిట్ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.

English summary
Mega Prince Varuntej helmed by a debutant Venky Atluri. The movie has been tentatively titled Tholi Prema however an official announcement is awaited.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu