»   »  బడ్జెట్ సమస్య: మెగా హీరో సినిమా ఆపేసారు

బడ్జెట్ సమస్య: మెగా హీరో సినిమా ఆపేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కంచె'లో వరుణ్‌ తేజని సెకండ్ వరల్డ్ వార్ కు చెందిన సైనికుడిలా డిజైన్ చేసి అందరి మెప్పు పొందిన క్రిష్ తన తదుపరి చిత్రానికి అదే హీరోని ఎంచుకున్నాడు. 'రాయబారి' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో మొదలు కానుందని అన్నారు. ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయే అవకాసం ఉందని తెలుస్తోంది.

అందుకు కారణం...తన కెమెరామెన్, ప్రొడ్యూసర్ తో కలిసిన జార్జియా లోని లొకేషన్స్ వెతకటానికి వెళ్లిన క్రిష్... అన్ని లెక్కలు వేసి ఇరవై కోట్లు పైగా బడ్జెట్ అవుతుందని తేల్చినట్లు తెలుస్తోంది. దాంతో వరుణ్ తేజ మీద ఇరవై కోట్లు బడ్జెట్ అంటే వర్కవుట్ కాదని భావించి డ్రాప్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Varun Tej's Raaybari dropped off!

మరో ప్రక్క ... లొకేషన్స్ పర్మిషన్స్ దొరకక పోవడం వలన, అలాగే టెక్నికల్ గా కూడా కొన్ని సమస్యలు రావడం వలన ఈ సినిమాని కొద్ది నెలల తర్వాత మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా రాయబారి సినిమా షూటింగ్ ని మార్చి నుంచి కొద్ది నెలలు ముందుకు వెళ్లనుంది. ఎప్పుడు మొదలవుతుంది అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తారంటున్నారు టీమ్.


'రాయబారి'లో క్రిష్ ...భారత నిఘా వ్యవస్థ 'రా' (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్)విభాగానికి చెందిన ఏజెంట్‌గా వరుణ్‌ను చూపించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'కంచె' తర్వాత మళ్లీ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయడం ఆనందంగా ఉందని వరుణ్ అంటున్నారు.

English summary
Director Krish has decided to drop off this project Raaybaari as it involves huge money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu