»   » నాగబాబు కొడుకు...డివిడి పట్టుకు తిరుగుతున్నాడు

నాగబాబు కొడుకు...డివిడి పట్టుకు తిరుగుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
varun tej wants to act in Ugram Remake
హైదరాబాద్ : రీమేక్ చిత్రాలంటే అందరు హీరోలకూ ఆసక్తే. ఎందుకంటే ఓ చోట ప్రూవ్ అయిన ఓ చిత్రం మరోచోట ఖచ్చితంగా ఆడే అవకాసం ఉందని నమ్మకం. అందుకేనేమో మెగాహీరో వరుణ్ తేజ ...కన్నడ హిట్ ఉగ్రం తెలుగులో చేయాలని ఆశిస్తున్నాడని వినికిడి. దాంతో తన దగ్గరకు వస్తున్న దర్శక,నిర్మాతలకు ఈ చిత్రం డివిడి ఇచ్చి సజెస్టు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ ,అల్లు అర్జున్ లాగ మాస్ ఇమేజ్ రావాలంటే తనకు అలాంటి కథలు అత్యవసరమని భావిస్తున్నాడట. అక్కడ సింపుల్ హీరోగా ఉన్న శ్రీమురళిని ఈ చిత్రం సూపర్ స్టార్ ని చేసింది. దాంతో వరుణ్ తేజ ఎట్టిపరిస్ధితుల్లోనూ ఈ చిత్రం రీమేక్ లో చేయాలని పట్టుదలతో ఉన్నాడని అంటున్నారు. రామ్ చరణ్ కి మగధీర, ఎన్టీఆర్ కి సింహాద్రిలాగ ఈ ఉగ్ర చిత్రం తనకు కెరీర్ బిల్డప్ కి ఉపకరిస్తుందని భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మొదట ఈ చిత్రం రీమేక్ లో ప్రభాస్, ఎన్టీఆర్ వంటివారు చేస్తారని వార్తలు వినిపించాయి. ఇప్పుడు సీన్ లోకి వరుణ్ తేజ వచ్చాడు.

తమిళం నుంచి సైతం రీమేక్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడిన ఈ చిత్రం కన్నడంలో రికార్డులు క్రియేట్ చేసే దిసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోయి రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా చూడకుండానే టాక్ విని తెలుగునుంచి ఇద్దరు హీరోలు ఈ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు అక్కడ మీడియాలో వార్తలు వచ్చాయి. చిత్రంలో హై ఓల్టేజి యాక్షన్ సీన్స్ ఉండటంతో తెలుగుకి ఇది వర్కవుట్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్తున్నారు.

మరో ప్రక్క ధనుష్ ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో చేయటానకి ఉత్సాహం చూపిస్తాడని చెప్తున్నారు. నార్త్ కర్ణాటక బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో నేరేషన్ హైలెట్ గా చెప్తున్నారు. మొదటి నుంచి చివరి వరకూ చాలా గ్రిప్పింగ్ గా సినిమా ని తీసాడని,యాక్షన్ ప్యాకెడ్ సీక్వెన్స్ లకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. రౌడీ రాజ్యంగా నడిచే ఓ ప్రాంతానికి తన స్నేహితుడుని కలవటం కోసం హీరో వస్తాడు. అక్కడ తన కళ్లెదురుగా ఓ అమ్మాయిని అక్కడ లోకల్ రౌడీలు రేప్ చేస్తూంటే చూస్తూ ఊరుకోలేకపోతాడు. దాంతో ఊరంతా సైలెంట్ గా ఉన్నా హీరో యాక్షన్ లోకి దిగి ఆ డాన్ ని చంపేసి,అక్కడ పరిస్దితులని తన చేతుల్లోకి తీసుకుని దారుణాలని అరికట్టాలని చూస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగిందనే కథాంశం చుట్టూ సినిమా నడుస్తుంది.

English summary
Varun Tej is interested to act in Telugu remake of Kannada super hit action film Ugramm directed by Prashanth Neel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu