పవన్ కోసం ప్లాన్ చేస్తోంది దాసరే నట
హైదరాబాద్: గత నాలుగైదు రోజులుగా పవన్ కళ్యాణ్ ...తమిళ చిత్రం ‘వీరమ్' చేస్తారంటూ ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. మొదట ఈ చిత్రాన్ని ఎస్.జె సూర్య డైరక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రభస దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ అన్నారు. ఇప్పుడు మరో దర్సకుడు సీన్ లోకి వచ్చారు.
అతను మరెవరో కాదు జానీ మాస్టర్. దీని వెనుక దాసరి ఉన్నారని తెలుస్తోంది. ఆ మధ్యన దాసరి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ చిత్రం ప్రకటించారు. అయితే దర్శకుడుగా దాసరి కాకుండా కేవలం నిర్మాతగానే ఆయన ఉండేటట్లు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆ చిత్రానికి తగ్గ కథ, దర్శకుడు కోసం వెతుకుతున్నారట.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ..దాసరి స్దాయికి తగ్గ కథ ఒక్కటీ ఏ దర్శకుడూ వినపించలేదుట. దాంతో ఆయన దృష్టి ‘వీరమ్' రీమేక్ పై పడిందిట. దాంతో ఈ ‘వీరమ్' రీమేక్ వార్త ప్రచారంలోకి వచ్చిందంటున్నారు.

తమిళంలో అజిత్ నటించిన ‘వీరమ్' హక్కుల్ని పవన్ కోసం కొనుగోలు చేసే ఆలోచనలో దాసరి ఉన్నారని సమచారం. అంతకు ముందుగనే .. ‘వీరమ్'ని పవన్ కోసం షో వేసి చూపించి నిర్ణయం తీసుకుంటారట.
ఆ తర్వాత పవన్ నిర్ణయం మేరకే . ‘వీరమ్' రీమేక్‌పై దృష్టి పెడతారని తెలుస్తోంది. ఒకవేళ ‘వీరమ్'కి పవన్ ఓకే అంటే.. ఈ చిత్రానికి నృత్య దర్శకుడు జానీ మాస్టర్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. అదీ అసలు కథ.


Click it and Unblock the Notifications











