twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీరూ పోట్ల దర్శకత్వంలో హిందీ రీమేక్

    By Srikanya
    |

    హైదరాబాద్: హిందీలో ఘన విజయం సాధించిన 'వెల్‌కమ్'ను తెలుగులో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మంచు మోహన్‌ బాబు (నానాపటేకర్ పాత్రలో), నాగచైతన్య(అక్షయ్‌కుమార్ కేరక్టర్‌లో) కలిసి నటించనున్నారు. ఈ ప్రాజెక్టుకు వీరు పోట్ల దర్శకత్వం వహిస్తారని సమాచారం. వీరూపోట్ల గతంలో నాగార్జునతో రగడ చిత్రం డైరక్ట్ చేసి ఉన్నారు. అలాగే మంచు మనోజ్ తో బిందాస్ తో దర్శకడుగా మారారు.

    తన తండ్రి మోహన్ బాబుతో శ్రీవాస్ దర్శకత్వంలో సొంత బేనర్‌పై సినిమా చేస్తున్న నటుడు మంచు విష్ణ ఇటీవల ట్విట్టర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వెల్‌కమ్ ' చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోందని తెలుస్తోంది.

    'వెల్ కమ్' చిత్రంలో అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ నటించారు. దీనికి రీమేక్ గా తెలుగులో రూపొందబోయే చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్రలో నాగ చైతన్య, అనిల్ కపూర్ పాత్రలో మోహన్ బాబు, మరో ముఖ్య పాత్రలో శ్రీహరి నటించనున్నారని తెలుస్తోంది. పలు టీవీ చానళ్లు కూడా ఈ విషయాన్ని వెల్లడించాయి. అయితే అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

    ఈ సినిమాను తెలుగుకు తగ్గట్టుగా తీర్చి దిద్దే పనిని రచయితలు కోనవెంకట్, బీవీఎస్ రవి, గోపి మోహన్ లు స్వీకరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ రచయితల జంట దేనికైనా రెడీ చిత్రంతో మంచి పామ్ లో ఉన్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం 'ఆటో నగర్ సూర్య' చిత్రంతోపాటు.... సునీల్‌తో కలిసి వెట్టై చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా నాగచైతన్య మోహన్ బాబుతో సినిమాకు కమిట్ కావడం గమనార్హం. ఈ మధ్య వరుస ప్లాపులతో డీలా పడ్డ చైతూ...ఈ మల్టీస్టారర్ మూవీలతోనైనా తన రాత మార్చుకుంటాడో చూడాలి.

    English summary
    Naga Chaitanya’s new movie will be directed by Veeru Potla of Ragada and Bindas-fame. This film is said to be a comedy mass entertainer. Sources say that Nagarjuna was impressed by Veeru Potla during the making of their film Ragada, and is said to have called him and given the nod to the project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X