»   » వెంకీ నిర్మాతను భయపెడుతున్న సల్మాన్ బాడీగార్డ్

వెంకీ నిర్మాతను భయపెడుతున్న సల్మాన్ బాడీగార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాంచన, కందిరీగ"లతో వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్నాడు కాబట్టి..బెల్లంకొండకు పెద్ద భయమేమీ లేదు కానీ 'చింతకాయల రవి", 'ఈనాడు", 'నమో వెంకటేశా", 'నాగవల్లి" చిత్రాలతో వరుసగా నాలుగు ఫెయిల్యూర్స్ ను మూటగట్టుకున్న వెంకటేష్ కు మాత్రం 'గంగ ది బాడీగార్డ్" చిత్రం విజయం సాధించడం చాలా అవసరం. ముఖ్యంగా సిల్వర్ జూబ్లీ ఇయర్ ను సెలబ్రేట్ చేసుకునే అవకాశం మిస్సవుతుంది 'గంగ ది బాడీగార్డ్" మిస్ ఫైర్ అయితే. ఇకపోతే ఈ భయానికి తోడు మరో భయం కూడా వెంకీ ఫ్యాన్స్ ను వెంటాడుతోంది.

అదేమిటంటే..ఈనెలాఖరుకు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'బాడీగార్డ్" విడుదల కానుండడం. 'బాడీగార్డ్ అనే మలయాళ చిత్రం హిందీలో అదే పేరుతో సల్మాన్ ఖాన్ తో రూపొందుతోంది. మలయాళ ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్దిక్ హిందీ 'బాడీగార్డ్" చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

త్రిష మరియు సలోని హీరోయిన్స్ గా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తెలుగు బాడీగార్డ్ కూడా దాదాపుగా పూర్తయిపోయింది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే నెలలో కానీ విడుదల చేసే అవకాశం కనిపించడం లేదు. దాంతో హిందీ బాడీగార్డ్ ను తెలుగు బాడీగార్డ్ తో పోల్చుతారేమోనన్న భయం బెల్లంకొండ సురేష్, గోపిచంద్ మలినేనిలతోపాటు, వెంకటేష్ ఫ్యాన్స్ ను కూడా వెంటాడుతోందని తెలుస్తోంది.

English summary
Venkatesh ‘Ganga- The Bodyguard’ (remake of Malayalam super hit movie ‘Bodyguard’) movie completed 70% of shooting, presently shooting going in Hyderabad. Already ‘Bodyguard’ movie made in Tamil as 'Kavalan' which became hit and Salman Khan doing in Bollywood with ‘Bodyguard’ title.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu