»   » వెంకీ చంద్రముఖీ-2 సెంటిమెంటుతో వాయిదా..

వెంకీ చంద్రముఖీ-2 సెంటిమెంటుతో వాయిదా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

పి వాసు దర్శకత్వంలో కన్నడంలో ఘన విజయం సాధించిన 'ఆప్తమిత్ర' సినిమాకు సీక్వెల్‌ గా తెలుగులో వెంకటేష్ చేస్తున్నాడు. దాదాపు సగం సినిమా షూటింగ్ పూర్తయిందని టాలీవుడ్ సమాచారం. క్లైమాక్స్ రామానాయుడు స్టూడియోలో చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. వెంకీ, అనుష్క, రిచా గంగోపాద్యాయతో క్లైమాక్స్ ను రామోజి ఫల్మి సిటిలో పూర్తి చేసి తర్వాత షెడ్యూల్ జైపు్ర్ షూటింగ్ తో సినిమా పూర్తి అవుతుందిని సమాచారం.

అయితే బుధవారం నానక్‌ రామ్‌ గూడలో షూటింగ్ జరుగుతుండగా డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు బాలరాజ్ చనిపోయాడు. దాంతో యూనిట్‌ కు సెంటిమెంట్ గుర్తుకు వచ్చింది. హీరో వెంకటేష్ షూటింగ్‌ ను కాన్సిల్ చేశాడు. భవిష్యత్‌లో ఇంకా ఏమి జరుగుతుందోనని నిర్మాతలు కంగారుపడుతున్నారు. వెంకీ సినిమాలో సెంటిమెంటు ఎక్కువుగా ఉండటం చూసాం, కానీ సినిమా షూటింగ్ అప్పుడు కుడా సెంటిమెంటు చూడడం వింతగా ఉంది కదూ!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu