»   » వెంకటేష్ చంద్రముఖి సీక్వెల్ కి స్ట్రైయిట్ టైటిల్?

వెంకటేష్ చంద్రముఖి సీక్వెల్ కి స్ట్రైయిట్ టైటిల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెంకటేష్ హీరోగా దర్శకుడు పి.వాసు రూపొందించనున్న 'ఆప్తరక్షక' రీమేక్‌ చిత్రానికి నాగమల్లి అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నాగమల్లి టైటిల్ చంద్రముఖి కన్నడ వెర్షన్(సౌందర్య నటించిన) టైటిల్. ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్ కి దీనిని పెట్టడంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. త్వరలో సెట్స్‌ మీదికి వెళ్లనున్న ఈ చిత్రంలో మొత్తం 6 నాయికలను ఎంపిక చేస్తున్నారు. వారిలో ప్రథమంగా నలుగురిని సెలక్ట్‌ చేసినట్లు తెలిసింది. వారు అనుష్క, కమలినీ ముఖర్జి, శ్రద్ధాదాస్‌, రిచా గంగోపాధ్యాయలు.

వెంకటేష్‌ సరసన అనుష్క ఇంతకుముందే నటించి ఉన్నారు. మిగతా నాయికలు ముగ్గురు కూడా వెంకటేష్‌...దీనిని నటిస్తుండటం ఇదే ప్రథమం అవుతుంది. ఈ చిత్రంలో ప్రతి అమ్మాయి కేరక్టర్‌ విభిన్నంగా వుంటుందని సమాచారం. మరో ఇద్దరు భామలు ఎవరన్నది ఇంకా నిర్ణయం జరగలేదు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు ధరించి ప్రేక్షకులను అలరించిన వెంకటేష్‌ ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తున్నట్లు సమాచారం.

'చంద్రము' సీక్వెల్‌గా వస్తున్నందున సహజంగానే ఈ చిత్రం మీద అధిక అంచనాలుంటాయని, ఆ అంచనాలను అందుకోవాలంటే తన కేరక్టరు మీద మాత్రమే కాకుండా మొత్తం కథనం మీద ప్రత్యేక శ్రద్థ తీసుకోవలసిన అవసరం వుందని వెంకటేష్ భావిస్తున్నారు. ఆరు భామలు కూడా కథలో భాగం పంచుకుంటున్నందున మరింత కలర్‌ఫుల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనుంది. శ్యామ్‌ కె.నాయుడు ఛాయాగ్రహణం సమకూరుస్తున్న ఈ చిత్రానికి చిన్నా ఆర్ట్‌ డైరెక్టరుగా వ్యవహరించనున్నట్లు తెలిసింది. ఈ నెలలో ఈ చిత్రం ముహూర్తం జరుపుకుని, వచ్చేనెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఏప్రియల్ నెలాఖరున ఈ చిత్రం లాంఛనంగా మొదలవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu