»   » త్వరలో బుల్లి తెరపై కనిపించనున్న సూపర్ స్టార్ విక్టరి..

త్వరలో బుల్లి తెరపై కనిపించనున్న సూపర్ స్టార్ విక్టరి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వేళ సీరియల్స్‌కు లభిస్తున్న ఆదరణ మనకు తెలిసిందే. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సీరియల్స్ సమయంలో టీవీలకు అతుక్కుపోతున్నారు. అందుకే, ఇప్పుడు బుల్లితెరపై కనిపించడానికి పెద్ద పెద్ద తారలు కూడా ముందుకొస్తున్నారు. ఆమధ్య అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ ... ఇలా పలువురు సీనియర్‌ నటులు బుల్లితెరపై కూడా నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరి బాటలో మరో అగ్రహీరో కూడా పయనించనున్నాడు. ఆయనే... విక్టరీ వెంకటేష్!. అవును... ఇది నిజమయ్యే రోజు త్వరలోనే రానుంది.

వెంకటేష్‌ ఎప్పటి నుంచో స్వామి వివేకానంద పాత్ర పోషించాలనుకుంటున్నాడు. ఆ కథతో సినిమా రూపొందించడానికి కూడా ప్రయత్నించాడు. అయితే, వివేకానందుని జీవితచరిత్రను రెండున్నర గంటల్లో చెప్పడం సాధ్యమయ్యే పని కాదని సినిమా నిర్మాణాన్ని విరమించుకుని, టీవీ సీరియల్ గా తీయాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఈ సీరియల్‌ సెట్స్‌పైకి వెళుతుందని తెలుస్తోంది!

English summary
Venkatesh is making debut into Television as actor. He will be playing the role of Swami Vivekananda, the great Indian philosopher. It would be 25 episodes TV series that focuses on the life and ideologies of Swami Vivekananda.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu