»   » వరస ఫ్లాఫ్ ల డైరక్టర్ తేజని టెన్షన్ లో పెట్టిన వెంకటేష్

వరస ఫ్లాఫ్ ల డైరక్టర్ తేజని టెన్షన్ లో పెట్టిన వెంకటేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా నెక్ట్స్ చిత్రం ప్లాప్ అంటూ మీడియాతో వెటకారం ఆడిన దర్శకుడు తేజకి...కేక చిత్రం తర్వాత ప్లాప్ అనిపించుకోవటానికి కూడా సినిమా రాలేదు. అయితే గత సంవత్సరం కాలంగా సురేష్ ప్రొడక్షన్ లో సినిమా చేస్తానంటూ మాత్రం తిరుగుతున్నాడు. వెంకటేష్ కి ఓ ఇంగ్లీష్ సినిమా ఎత్తి కథ వినిపించాడు. పాయింట్ బాగుంది కానీ నేరేషన్ నచ్చలేదంటూ ఆయన్ని సిట్టింగ్ లలో కూర్చోబెట్టి కథ వండించటం మొదలెట్టారు. దాదాపు సంవత్సర కాలంగా వంటకం చేసిన తేజ..ఆ కథని ఓకే చేయంచటంలో మాత్రం విఫల మవుతున్నారు. దానికి కారణం వెంకటేషే అని చెప్తున్నారు. వెంకటేష్ కోసం తేజ రెడి చేసిన సావిత్రి కథని విన్న వెంకటేష్ తన తాజా చిత్రం నాగవల్లి రిలీజ్ తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని చెప్పటం తేజని టెన్షన్ లో పడేసింది. మరో ప్రక్క తన స్క్రిప్టుని ప్రక్కన పెట్టానని చెప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం, మళయాళ చిత్రం బాడీగార్డు రీమేక్ ని చేస్తానని వెంకటేష్ కమిటవటం తేజ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళూ అందరితో ఆడుకున్న తేజ ఈ రోజు తనతో మిగతావాళ్ళంతా ఆడుకుంటున్నారని వాపోతున్నారుట. అదీ సంగతి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu