»   » 'షాడో' ఎఫెక్ట్: అతి జాగ్రత్తలతో దర్శకులకు ఇబ్బంది

'షాడో' ఎఫెక్ట్: అతి జాగ్రత్తలతో దర్శకులకు ఇబ్బంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మల్టి స్టారర్ చిత్రాలు వరసగా చేసుకుంటూ వెళ్తున్న వెంకటేష్.. సోలో హీరోగా మరోసారి తెరపై కనపడి అలరించనున్నాడు. ఈ మేరకు ఆయన సోదరుడు,ప్రముఖ నిర్మాత సురేష్ బాబు...యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చాలా కథలు విన్నా..ఏ కథకీ వీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని, షాడో లా మరో చిత్రం డిజాస్టర్ కాకూడదని,తీసుకుంటున్న అతి జాగ్రత్తలతో కథ పట్టుకుని తిరుగుతున్న కొత్త దర్శకులుకు ఇబ్బందులుగా తయారు అవుతున్నాయని ఫిల్మ్ నగర్ సమాచారం.

దానికి తోడు చాలా కాలం కథ డిస్కషన్స్ జరిగిన తర్వాత కథ నచ్చలేదని చెప్పటంతో వారు విలువైన సమయాన్ని సైతం కోల్పోయి ఆవేదనకు గురి అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. పెద్ద హీరో,పెద్ద బ్యానర్ కదా ఆశ పడితే స్టోరీ లైన్ బాగుందని, తర్వాత విడతలు విడతలుగా వివిధ వ్యక్తులతో.. చర్చలు జరిపి ఫైనల్ గా కథ బాగోలేదంటూ బయిటకు రావటం నిరాసకు గురి చేస్తోందంటూ వాపోతున్నారు. అయితే పెద్ద బ్యానర్ నుంచి సినిమా అంటే అదీ భారీ బడ్జెట్ అంటే ఆ మాత్ర ఇబ్బందులు కామనే అంటున్నారు. ఈ జాగ్రత్తలు అన్ని తీసుకునేది హిట్ కోసమే కదా అని అంటున్నారు.

ఇక వెంకటేష్,రామ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'మసాలా' . హిందీలో విజయవంతమైన 'బోల్‌ బచ్చన్‌' ఆధారంగా తెరకెక్కించారు. అంజలి, షాజన్‌ పదమ్‌సీ హీరోయిన్స్. కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు. ఈ చిత్రం ఈ నెల 14న థియోటర్స్ లోకి రానుంది.

వెంకటేష్ సరసన అంజలి, రామ్కు జోడీగా షాజన్ పదమ్ సి నటించారు. 'మసాలా' ఆడియో దసరాకు విడుదల చేయనున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. అక్టోబర్ చివరి వారంలో సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. వెంకటేష్, రామ్ తొలిసారిగా కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
In December Venkatesh will be starring in a film that has Ram Charan in it. But now Venky is planning to act in a solo starrer. Now Venky and his producer brother D Suresh Babu are planning for a new movie. His last solo film was Shadow, the film bit dust within couple of days of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu