తెలుగు 'బాడీగార్డ్' గా వెంకటేష్ తప్పదు?

By Srikanya

మలయాళంలో వచ్చి విజయవంతమైన 'బాడీగార్డ్‌' చిత్రాన్ని తమిళంలో విజయ్,ఆసిన్ లతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో రీమేక్‌ చేయబోతున్నారు. అయితే తెలుగులోనూ ఈ రీమేక్ చేయాలని చాలా మంది ఉత్సాహపడుతున్నారు. అయితే హీరోగా వెంకటేష్ అయితేనే బావుంటాడని వినపడుతోంది. ఆ మధ్య వెంకటేష్ ఈ చిత్రాన్ని ప్రత్యేకమైన స్క్రీనింగ్ వేయించుకుని చూసారు. అయితే ఏ విషయం కన్ఫర్మ్ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. దాంతో వేరే హీరోలెవరూ ఈ రీమేక్ వైపు కన్నెత్తి చూడలేదు. దాంతో దర్శకుడు సిద్దిఖీ ..హిందీలో ఈ లోగా సినిమా చేసుకుంటానని వెళ్ళిపోయాడు.

ఇక సల్మాన్ ‌ఖాన్‌ ఇటీవలి కాలంలో దక్షిణాదిన వచ్చి విజయవంతమైన చిత్రాల రీమేక్‌ల్లోనే ఎక్కువగా నటించడానికి అంగీకరిస్తున్నారు. తెలుగు చిత్రాలు 'రెడీ', 'కిక్‌' రీమేక్‌ల్లో నటిస్తున్నారు. ఆ క్రమంలో 'బాడీగార్డ్‌'ను చేయడానికి ఒప్పుకొన్నారు. ఇందులో కత్రినా కైఫ్‌ ను నాయికగా అనుకొని నిర్మాత అతుల్‌ అగ్నిహోత్రి ఆమెను కలిశారు. అయితే తనకు కాల్షీట్లు ఖాళీగా లేవని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ అవకాశం కరీనా కపూర్‌ దక్కించుకొంది. 'మై లవ్‌ స్టోరీ' అనే పేరుతో హిందీలో ఈ సినిమా రీమేక్‌ అవుతుంది. సిద్దిఖీ దర్శకత్వం వహిస్తారు. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఇక వెంకటేష్ ప్రస్తుతం ఆప్తరక్షక రీమేక్...చంద్రముఖి సీక్వెల్ చేస్తున్నారు. ఈ బాడీ గార్డ్ ని కూడా ఒప్పుకుంటే ఓ పనైపోతుంది కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X