For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ న్యూస్ : నాగ చైతన్య సినిమాలో కీ రోల్ లో వెంకటేష్

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకటేష్.. త్వరలోనే ఓ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి రెడీ అవుతున్నాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడని సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు... ప్రేమమ్ రీమేక్.

  ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు.

  ఒరిజినల్ వర్షన్ లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్ కు మజ్ను అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.

  venkatesh guest in Naga Chaitanya in 'Premam' remake ?

  ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకటేష్, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్ లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు.

  ఈ మధ్యకాలం చిన్న బడ్జెట్ లో వచ్చి మళయాళంలో సూపర్ హిట్టైన చిత్రం 'ప్రేమమ్‌'. ఇదో ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తారని తెలిసింది. కె.రాధాకృష్ణ నిర్మిస్తారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తారని ఫిల్మ్‌నగర్‌టాక్‌. ఇటీవల చైతూ కూడా ఈ సినిమాని చూశాడట. తన క్యారక్టర్ బాగా నచ్చి వెంకటేష్ పచ్చజెండా ఊపేశాడని చెప్పుకొంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  venkatesh guest in Naga Chaitanya in 'Premam' remake ?

  జార్జ్ అనే కుర్రాడు టీనేజ్ లో, కాలేజ్ లో , సెటిలేజ్ లో ముగ్గురు అమ్మాయిలను ప్రేమిస్తాడు. వారి ప్రేమను సాధించుకోవటం లో ఊహించని అడ్డంకులు ఎదురై ,కలలు కరిగిపోయి ప్రేమించిన వారు మరొకరితో సెటిల్ అవ్వతుంటే తట్టుకోలేక గుండె పగిలేలా.. ఇలా కథ సాగుతుంది.

  ఇక నివిన్ పౌలీ ఈ చిత్రంతో హీరో గా పరిచయమయ్యారు. ఆల్ఫోన్సే పూతరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో తెరకెక్కింది. మే 29న విడుదలయిన ఈ చిత్రం పెద్ద హిట్టయ్యింది.

  జూన్ నెలలో విడుదలైన ఈ 'ప్రేమమ్' చిత్రం టాక్ బాగుండటంతో ... విదేశాలలోనూ విడుదల చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా వసూళ్ళు యాభై కోట్లకు చేరుకున్నాయి. మళయాళ పరిశ్రమలో ఇలా లో బడ్జెట్ చిత్రం ఈ రేంజిలో హిట్ అయ్యి..ఇంత వసూలు చేయటం పెద్ద రికార్డు.

  ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం తమిళ, కన్నడ భాషల నుండే కాకుండా హిందీ పరిశ్రమనుండీ మంచి డిమాండ్ ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

  English summary
  Venkatesh to do a cameo in Naga Chaitanya’s 'Premam' Telugu remake 'Majnu'. As reported earlier, Malayalam film Premam is being remade in Telugu as ‘Majnu’ with Chandu Mondeti as director. Naga Chaitanya and Shruti Haasan will play the lead roles. The other female leads being considered now are Dishang Patani and Umang Jain.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X