»   » వెంకీ మరో రీమేక్: జయంత్ పరాంన్జీ డైరక్టర్

వెంకీ మరో రీమేక్: జయంత్ పరాంన్జీ డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీమేక్ స్పెషలిస్ట్ వెంకటేష్ తాజా చిత్రం మసాలా నిన్న గురువారం విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయినా పట్టువదలని విక్రమార్కుడులా...ఈ రీమేక్ లపై మమకారం తగ్గని వెంకటేష్ మరో రీమేక్ ఓకే చేసాడని, దానికి జయంత్ పరాంన్జీ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. ఆ రీమేక్ చిత్రం మరేదో కాదు...పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం 'ఓ మై గాడ్'. ఈ చిత్రం అక్కడ మాంచి హిట్ అయింది. ఇందలో అక్షయ్ కుమార్ చేసిన శ్రీకృష్ణుడు పాత్రను వెంకీ చేస్తాడని తెలుస్తోంది.

వరసగా రీమేక్ లు చేయటం గురించి వెంకటేష్ మాట్లాడుతూ.... ఇక్కడ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోలేం. ఎంతసేపూ సురక్షితంగానే ప్రయాణం చేయాలి. ఆ పంథాలో ఆలోచించినప్పుడే రీమేక్‌ సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయినా రీమేక్‌ చేయడం తప్పేం కాదు. మంచి సినిమా అనుకొన్నప్పుడు... దాన్ని మన ప్రేక్షకులకు కూడా అందేలా చేయాలి. అలా చేసిన ప్రతీసారీ నాకు విజయం దక్కింది. నేనే కాదు... హీరోల్లో చాలామంది రీమేక్‌ సినిమాలు చేశారు. కాకపోతే వాటిలో నాకు ఎక్కువ విజయాలున్నాయి. ఇటీవల పొరుగు భాషల్లోని హీరోలు సైతం రీమేక్‌ సినిమాలపై దృష్టి కేంద్రీకరించారు. హిందీలో సల్మాన్‌ఖాన్‌ మన తెలుగు కథలతో విజయాలు అందుకొంటున్నాడు. కథలు వినిపించడానికి చాలామంది వస్తుంటారు. అయితే... ఆ కథలు ప్రేక్షకులకి ఎలా చేరతాయనే విషయం గురించి ఆలోచించాలి. అప్పుడే సరైన ఫలితాలొస్తాయి అన్నారు.

'ఓ మై గాడ్' తెలుగులో రీమేక్ చేయాలన్న ప్రయత్నాలు చాలా కాలం క్రిందటే మొదలయ్యాయి. సురేష్ బాబు రైట్స్ తీసుకుని వెంకీతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో కీలకపాత్ర అయిన పరేశ్ రావల్ పాత్రకు రాజేంద్రప్రసాద్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. గతంలో వెంకటేష్,జయంత్ కాంబినేషన్ లో ప్రేమించుకుందాం రా,ప్రేమంటే ఇదేరా,ప్రేమతో రా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే్.

ప్రకారం....ఇటీవలే వెంకటేష్ 'ఓ మై గాడ్' చిత్రం చూసాడని, స్టోరీ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడని, ఆ చిత్రంలో అక్షయ్ కుమార్ మాదిరి లార్డ్ శ్రీకృష్ణ పాత్ర చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈచిత్రంలో లవ్ స్టోరీ, ఫైట్స్ తక్కువగా ఉండటం, కథ ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు, మెప్పిస్తుందని వెంకటేష్ భావిస్తున్నాడట. అయితే ఈచిత్రం విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ రానుంది.

పరేష్‌ రావల్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్‌'. అక్షయ్‌ కుమార్‌ కూడా ఓ కీలక పాత్రలో నటించి నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించారు. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించారు. 'కంజి విరుద్ధ్‌ కంజి' నాటకం ఈ చిత్రానికి ఆధారం.

'ఓ మై గాడ్‌'కథ ఏమిటంటే... పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ.

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఓ మై గాడ్‌'లో అక్షయ్ ఆధునిక శ్రీకృష్ణునిగా కనిపించాడు. పరేష్‌రావల్‌ ఓ కీలక పాత్ర చేసిన ఈ సినిమాని అశ్వనీ యార్ది దర్శకత్వం వహించగా గ్రేజింగ్‌ గోట్‌బ్యానర్‌పై అక్షయ్ స్వయంగా నిర్మించాడు. ఈ కథ ప్రధానంగా నాస్తికుడిగా నటిస్తున్న పరేష్‌రావల్‌ చుట్టూ నడుస్తుంది. ఓ కేసు విషయమై అతను శ్రీకృష్ణుడిని ఎలా కోర్టుకి లాగుతాడు, కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడన్నది కథ. ఓ గుజరాతీ నాటకం దీనికి ఆధారం. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి నిర్మాత కృష్ణప్రసాద్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఆయనతో పాటు అక్షయ్, యార్ది కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశా లున్నాయి.

English summary
Buzz is that Venky has agreed to be a part of Telugu remake of last years hit comedy Oh My God. Jayanth C Paranee is directing the movie to be produced by Rama Naidu. It is learnt that Jayanth approached Venky with the proposal of playing Akshay Kumar's role. Akshay played Lord Krishna's character in the movie. So looks like Venkatesh is all set to wear the grease paint once again to play a God onscreen. Not sure if he ever did something like that onscreen before.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu