»   » 'బాడీ గార్డ్' చిత్రం రీమేక్ లోనూ వెంకటేష్?

'బాడీ గార్డ్' చిత్రం రీమేక్ లోనూ వెంకటేష్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ చిత్రం 'ఆప్త రక్షక' రీమేక్ కి కమిటయిన వెంకటేష్ తాజాగా మరో మళయాళ రీమేక్ చేయటానికి కమిటయ్యారని తెలుస్తోంది. మళయాళ దర్శకుడు సిద్దిక్ రూపొందించిన 'బాడీ గార్డ్' చిత్రం అక్కడ ఘన విజయం సాదించింది. దిలీప్, నయనతార కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో దిలీప్ చిన్నప్పటి నుంచి గూండాలను ఆరాధిస్తూ పెరుగుతాడు. అలాగే ఎప్పుడూ ఏదో సాహసం చేసి అందరి చేతా గౌరవింపబడాలి అనుకుంటూంటాడు. అలా పెద్దయిన అతను ఓ పెద్ద మాఫియా డాన్ కూతురుకు బాడీ గార్డ్ గా వెళతాడు. ఆమెను ఓసారి రక్షించటంతో అతనికి ఆ పని అప్పచెప్తున్నారు. ఇక ఆ డాన్ కూతురు నయనతార. ఆమెకు తన స్వేచ్చను హరిస్తూ దిలీప్ బాడీ గార్డ్ గా ఉండటం ఇష్టపడదు. దాంతో జీలో చదువుతున్న ఆమె తన స్నేహితురాలితో కలిసి దిలీప్ సెల్ కి ఫోన్స్ చేస్తూ ఆడుకుంటుంది. అలాగే తాను అతన్ని ప్రేమిస్తున్నానంటూ ఏడిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్ లో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఆ విషయం ఆమె తండ్రికి తెలుస్తుంది. అప్పుడు ఏమౌతుంది అన్నకోణంలో సెకెండాప్ రన్ అవుతుంది. ఆద్యంతం ఫన్ తో నడిచే ఈ చిత్రాన్ని దర్శకుడు సిద్దిక్ తమిళంలో విజయ్ తో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి తెలుగులో ఓ పెద్ద నిర్మాత దగ్గర ఈ చిత్రం రైట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కి చూపించి ఆయన చేయటానికి పూర్తి స్దాయి హామీ ఇచ్చాక దర్శకుడు కోసం వెతికే ఆలోచనలో ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu