»   »  'చింతకాయిల రవి' పై గుర్రుగా ఉన్న వెంకీ?

'చింతకాయిల రవి' పై గుర్రుగా ఉన్న వెంకీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Venkatesh
చింతకాయిల రవి సినిమా కలెక్షన్స్ మెల్లిగా డ్రాప్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో మొదట నుంచీ వెంకటేష్ అసంతృప్తిగానే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. స్క్రిప్టు పై మరింత శ్రధ్ధ పెట్టమని వెంకటేష్ కోరినా డైరక్టర్ చేతులెత్తేసాడనీ,నిర్మాత ఆబ్లిగేషన్ మేరకు షూటింగ్ ప్రారంభించనట్లు వెంకీ శ్రేయాభిలాషులు చెప్పుకుంటున్నారు.

అందుకే త్వరలో ప్రారంభం కానున్న 'కృష్ణం వందే జగద్గురం' ప్రాజెక్టుకు ఈ సమస్యలు రాకూడదనీ స్క్రిప్టు వైపు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారనీ తెలుస్తోంది. వెంకటేష్ స్వయంగా స్క్రిప్టు వర్క్ లో ఇన్వాల్వ్ అయ్యారనీ సమాచారం. కాబట్టి మంచి అవుట్ పుట్ వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. అంతేగాక దర్శకుడు క్రిష్ కూడా బాగా స్పోర్టివ్ గా వెంకీ కామెంట్స్ ని తీసుకుని మరింత కష్టపడుతున్నాడని ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఈ కాంబినేషన్ మరో అద్బుతమైన విజయాన్ని గ్యారింటీగా సాధించి తీరుతారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X