»   » కన్నడ రీమేక్ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్...

కన్నడ రీమేక్ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వెంకటేష్ మరో రీమేక్ చేయబోతున్నారా అంటే...అవుననే వినబడుతోంది. ఆయన కన్నడ చిత్రం పుంగిదాస రీమేక్ లో నటించేందుకు ఆసక్తి చూపెడుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరిగాయని చెప్పుకుంటున్నారు. ఇదే విషయాన్ని కన్నడ మీడియా హైలెట్ చేస్తూ ఆ చిత్రానికి ప్రచారం కలిగిస్తోంది. చిత్రమేమిటంటే...ఇంకా పుంగిదాస విడుదల కాలేదు.

విడుదలకు ముందే కన్నడ చిత్రం పుంగిదాస సినిమాకు వివిధ భాషల నుంచి డిమాండ్‌ వస్తోంది. ఇప్పటికే తమిళంలో రీమేక్‌ చేసేందుకు అక్కడి నిర్మాత ఒకరు హక్కుల్ని పొందారు. తాజాగా దీన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయనున్నారు. అందులో విక్టరీ వెంకటేష్‌ నటిస్తారని తెలుస్తోంది.

Venkatesh in 'Pungi Dasa' Remake?

పుంగిదాస సినిమాలో కోమల్‌, అస్మ జంటగా నటించారు. త్వరలోనే విడుదల కానుంది. బి.సి.పాటిల్‌, సుదర్శన్‌, జానకి, ఆశిష్‌, తబలానాణి, కురిప్రతాప్‌, పద్మజారావు ప్రధాన తారాగణం. సినిమా ఆద్యంతం కడుపుబ్బ నవ్వించేలా ఉంటుందని యూనిట్‌ సభ్యులు తెలిపారు. పుంగిదాస అంటే అబద్దాలు తడుముకోకుండా చెప్పేవాడని అర్దం. ఈ సినిమాలో హీరో చెప్పే అబద్దాలన్ని మంచి జరగటానికే ఉపయోగిస్తూంటాయి. అనుకోకుండా చెప్పిన ఓ పెద్ద అబద్దం వల్ల ఎలా హీరో ఇరుక్కుబోయి..బయిటపడ్డాడనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

ప్రస్తుతం వెంకటేష్ రాధ అనే చిత్రం చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం లో వెంకటేష్ ...హోం మినిస్టర్ గా కనిపిస్తారు. నయనతార హీరోయిన్ గా కనిపించే ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రం పై వెంకటేష్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అంటున్నారు.

English summary
'Pungi Dasa' is referred to a person who utters lies frequently. Such a character is played by top comedy hero Komal Kumar in the film. All the lies he utters is good for the situation. That is funny and timely. The situation for uttering lies is made very compact by MS Srinath who directed successful film 'Rambo'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu