»   » ఆ స్టార్ హీరోకి సెంటిమెంట్ భాగా వర్క్ అవుట్ అవుతోంది...!?

ఆ స్టార్ హీరోకి సెంటిమెంట్ భాగా వర్క్ అవుట్ అవుతోంది...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ హీరో అయినా తన సినిమాకి పవర్ ఫుల్ గా ఉండే టైటిల్ పెట్టుకుందామని అనుకుంటాడు. కానీ హీరో వెంకటేష్ ఏంటో రివర్స్ లో ఆడాళ్ల టైటిల్స్ తో వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. 'మల్లీశ్వరి", లక్ష్మీ, తులసి అంటూ లేడీ టైటిల్స్ తో హిట్లు కొట్టిన వెంకటేష్ మళ్లీ 'నాగవల్లి"తో ముందుకొస్తున్నాడు. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టయిపోతుందని వెంకటేష్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. వెంకటేష్ కి ఎలాంటి కథ చెప్పాలనే దానికంటే ఎలాంటి టైటిల్ చెప్పి పడగొట్టాలో తెలుసుకొన్నడైరెక్టర్ తేజ అతనికి తాజాగా 'సావిత్రి" అనే టైటిల్ చెప్పి పడగొట్టాలో తెలుసుకున్న డైరెక్టర్ తేజ అతనికి తాజాగా 'సావిత్రి" అనే టైటిల్ చెప్పి పడేశాడు. తేజ కథలో విషయం ఎంతుందో తెలీకపోయినా 'సావిత్రి" అనే పేరు మాత్రం సూపర్ గా ఉందని వెంకటేష్ ఒకే చేసేశాడు. అసలే హిట్లు లేక తన ముఖం దేఖే దిక్కులేక అల్లాడుతన్న తేజ తనకు ఏకంగా వెంకటేష్ లాంటి అగ్ర హీరో డేట్లు దొరికే సరికి తబ్బిబ్బయిపోతున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu