For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వెంకటేష్ ‘షాడో’పై ఇది రూమరా? నిజమా?

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'షాడో'. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తాప్సి హీరోయిన్ గా శ్రీకాంత్‌, మధురిమ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో 'షాడో' టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చినా ఈ చిత్రం రీ షూట్ కి వెళ్లబోతోందంటూ వార్తలు అంతటా వినపడుతున్నాయి. దానికి తోడు ఆ మధ్యన దాదాపు షూటింగ్ అయిపోవచ్చిందని అఫీషియల్ గా న్యూస్ లు వచ్చాయి. అయితే తాజాగ ఈ చిత్రం మలేషియాలో మరో 17 రోజులు షూటింగ్ మిగిలి ఉందని దర్శకుడు చెప్పటం జరిగింది. ఈ నెల 8 నుంచి 27 వరకూ మలేషియాలో షూటింగ్ ప్లాన్ చేసారు. దానికి కారణం చాలా సీన్స్ రీషూట్ చేయాల్సి రావటమే అని తెలుస్తోంది.

  రషెష్ చూసిన వెంకటేష్ అసంతృప్తితో ఉండటంతో ఈ రీ షూట్ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. అయితే ఇది రూమర్ అని కొద్ది మంది కొట్టిపారేస్తున్నారు. గతంలో ఇదే నిర్మాత నా ఇష్టం చిత్రం నిర్మించారు. అప్పుడు కూడా రీషూట్ లు భారీగా చేసారు. ఆ చిత్రం కూడా ఎక్కువ భాగం మలేషియాలో చేసారు. వెంకటేష్ అన్న కొడుకు దగ్గుపాటి రానా అందులో హీరో. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు అటువంటి ఛాన్స్ లేకుండా పూర్తిగా సాటిస్ ప్లే అయ్యేకే విడుదల చెయ్యాలని, క్వాలిటీ కోసమే రీ షూట్ పెట్టుకున్నారని టాక్.

  ఇక ఈ చిత్రం గురించి వెంకటేష్ మాట్లాడుతూ...''సినిమా పేరు 'షాడో' అనగానే థ్రిల్లయ్యాను. కథ వినగానే ఉద్వేగానికి లోనయ్యాను. ఇదొక యూనివర్సల్ ఫీల్ ఉన్న స్టైలిష్ సినిమా. సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలన్నీ పొందుపరచి మెహర్ రమేష్ ఈ సినిమాను మలిచాడు. నేను ఇందులో కొత్తగా కనిపిస్తాను. నన్నొక కొత్త కోణంలో చూపించే కథ ఇది. యాక్షన్‌తో పాటు, అన్నిరకాల భావోద్వేగాలు ఉంటాయి. మెహర్‌ రమేష్‌ ఎంతో పరిణతితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు'' అన్నారు.

  శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''వెంకటేష్‌తో ఇది నాకు నాలుగో చిత్రం. ఈ కథలో వినోదంతోపాటు, నాటకీయత నన్ను ఎంతగానో ఆకట్టుకొంది. మెహర్‌ రమేష్‌ పనితీరు చాలా బాగుంది'' అన్నారు. ''నన్ను, కథను నమ్మి ఈ అవకాశాన్నిచ్చారు వెంకటేష్‌. మంచి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్న చిత్రమిది. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌, గ్లామర్‌... ఇలా అన్ని అంశాలు ఇందులో మిళితమై ఉంటాయి. వెంకటేష్‌ని చూపించిన విధానం ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటుంది. మలేషియా, లంకావిలో తీసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. వెంకటేష్‌తోపాటు, శ్రీకాంత్‌ కూడా ఎంతో రిస్క్‌తో కూడిన సన్నివేశాల్లో నటించారు. ఇప్పటికే 70శాతం చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు దర్శకుడు.

  ''నన్ను మరింత అందంగా చూపించే చిత్రమిద''న్నారు తాప్సి. ''ఒక చిన్న ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది'' అన్నారు రచయిత కోన వెంకట్‌. గ్లామర్‌తో పాటు అభినయానికి కూడా ఆస్కారమున్న పాత్రను ఇందులో చేస్తున్నానని తాప్సీ అన్నారు. ఇంకా పరుచూరి కిరీటి, కోనవెంకట్, గోపీమోహన్ తదితరులు కూడా పాల్గొన్నారు. నాజర్, సాయాజీషిండే, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, నాగినీడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: తమన్, నిర్మాణం: యూస్క్వేర్ మూవీస్.

  English summary
  
 Shadow movie first teaser released yesterday and get good response. some rumars say that the film is going to Malasiya to Reshoot Key sceanes. Venkatesh, Tapsee’s 'Shadow' under Meher Ramesh's direction recently gearing up for its schedule in Hyderabad where another song in RFC would be shot under Raju Sundaram's choreography on Venky and Tapsee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X