»   » సెట్ అవుతుందా? :పవన్ లుక్ నే వెంకీ తన తదుపరి చిత్రంలో...

సెట్ అవుతుందా? :పవన్ లుక్ నే వెంకీ తన తదుపరి చిత్రంలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ పెప్పర్ సాల్ట్ హెయిర్ స్టైల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకటేష్ కూడా అదే దారిలో ప్రయాణించబోతున్నట్లు సమాచారం. వెంకటేష్ తన తదుపరి చిత్రంలో పెప్పర్ సాల్ట్ లుక్ లో కనిపించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంతకీ వెంకీ తర్వాత చేయబోయే చిత్రం ఏమిటీ అంటారా...

తమిళ హీరో మాధవన్‌ నటించిన సాలా ఖడూస్‌ హిందీ, తమిళ భాషలలో విడుదల కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను సాధించింది. బాక్సర్‌గా మాధవన్‌ ఈ చిత్రంలో నటించాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని వెంకీ తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో భారీ దేహంతో కనపడాల్సి ఉండగా, వెంకీ అందుకు సంబంధించి కసరత్తులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.

venki

ఇంతకీ ఈ సినిమాలో అంత స్పెషాలిటి ఏమిటంటే.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో పాటు స్క్రీన్ ప్లే ని కూడా అందించాడు. అప్పట్లో షారుఖ్ ఖాన్ కి చక్ దే ఇండియా ఎంతటి పేరు తెచ్చిందో ఈ సినిమా మాధవన్ కి అంత పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఓ రిటైర్డ్ బాక్సర్ ఓ లేడి బాక్సర్ ను ఎలా చాంపియన్ చేశాడో అదే స్టోరీ.


కాగా ఈ స్టోరీ ఎంతో నచ్చిన వెంకటేష్ హిందీలో ఈ సినిమా హిట్ అయితే వెంటనే తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని చెన్నై బేసెట్ తెలుగు దర్శకురాలు సుధా కొంగర డైరక్ట్ చేసింది. వైనాట్ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ వారితో కలిసి ఈ సినిమాని నిర్మిస్తారు. తెలుగులో కూడా సుధ కొంగరనే దర్శకత్వం వహిస్తారని తెలిసింది.

English summary
Venkatesh has decided to do the remake of 'Saala Khadoos' as his next movie. Venkatesh will sport salt and peppered look for this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu