»   » ద్యాముడా..ఆ రీమేక్ లోనూ వెంకీ? నప్పుతాడా?

ద్యాముడా..ఆ రీమేక్ లోనూ వెంకీ? నప్పుతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకటేష్ అంటే రీమేక్ ల రాజా అంటూంటారు. ఆ పేరుని నిలబెట్టుకోవటానికా అన్నట్లు ఆయన ఎక్కడెక్కడ రీమేక్ లను వెతికి పట్టుకుని చేసేస్తూంటారు. ఇప్పుడు ఆయన కంట్లో ఇంకో తమిళ హిట్ పడిందని, దాని రీమేక్ చేసేయాలని ఆయన ఉత్సాహపడుతున్నట్లు సమాచారం.

తమిళంలో రీసెంట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం సేతుపతి. ఈ చిత్రంలో పోలీస్ ఇన్సపెక్టర్ గా విజయసేతపతి చేసారు. విజయసేతుపతికు ఓ లోకల్ డాన్ కు ఢీ అంటే ఢీ అన్నట్లు గా కథ జరుగుతుంది. ఈ చిత్రం అక్కడ సింపుల్ గా రిలీజై మంచి హిట్ ని నమోదు చేసింది.

దాంతో వెంకటేష్ ఎలాగైనా ఈ సినిమాని తీసుకుని హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే విజయసేతపతి ఏజ్ కు సూట్ అయ్యే పాత్ర అదని, అతని మేనరిజంలతో సినిమాని లాక్కెళ్లిపోయాడని, వెంకీ ఆ పాత్రను ఎలా పోషిస్తాడని అంటున్నారు.

Venkatesh to step into the shoes of Vijay Sethupathi

గతంలోనూ సూర్య నటించిగా పెద్ద హిట్టైన కాక్క కాక్క చిత్రాన్ని తెలుగులో ఘర్షణ టైటిల్ తో అదే దర్శకుడు గౌతమ్ మీనన్ ని తీసుకునివచ్చి రూపొందించినా వర్కవుట్ కాలేదు. దాంతో ఒకటికినాలుగుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదంటున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ ... మరో రీమేక్‌ చిత్రంలో నటించటానికి రెడీ అవుతున్నారు . మాధవన్‌ హీరోగా హిందీలో తెరకెక్కిన 'సాలా ఖదూస్‌'పై వెంకీ మనసు పడ్డారు. అందుకోసం ఆయన బాడీని పెంచుతున్నారు.

సాధారణంగా నటులు బరువు పెరగటానికి ఇష్టపడరు. కానీ వెంకటేష్ మాత్రం ఈ పాత్రకు న్యాయం చేయాలని బరువు పెరుగుతున్నరు. ఒక బాక్సర్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంలో మాధవన్‌ ఓ బాక్సర్‌గా, బాక్సింగ్‌ కోచ్‌గా కనిపిస్తాడు. చిత్రాన్ని చూసిన వెంకీ తెలుగులో తాను చేయాలని నిర్ణయించుకొన్నారని సమాచారం.

Venkatesh to step into the shoes of Vijay Sethupathi

తెలుగమ్మాయైన సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు చిత్రానికి ఆమే దర్శకత్వం వహిస్తారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది. అదే విధంగా బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం.

English summary
Vijay Sethupathi's latest outing Sethupathi has opened to good response from critics and audiences alike. Now, the film is reportedly being remade in Telugu with Venkatesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu